దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్రం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. 2025 నుండి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2021 కరోనా సమయంలోనే జరగాల్సిన జనాభా లెక్క లెక్కింపు వాయిదా పడుతూ వస్తుంది. అయితే 2026 నాటికి జనాభా లెక్కలను పూర్తిస్థాయిలో లెక్కిం చాలని లక్ష్యంతో కేంద్రం ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తున్నది. ఆ తరువాత లోక్సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి 2028 నాటికి ముగించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2029లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
