26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం ‘గాంధీ హత్య’’

(నిన్నటి తరువాయి)

1919 సంవత్సరపు చట్టము ప్రకారము మతపరమైన ప్రాతినిథ్యము మరింత విస్తృతము చేయబడి రాష్ట్ర శాసనసభలలోను, స్థానిక సంస్థలల్లోను కొనసాగించుటయేగాక మంతత్రిమండలుల లోనికి కూడా విస్తరింపబడినవి. ఉద్యోగములు మత ప్రాతిపదికమీద పంచడము ప్రారంభమైనది. సమర్థత మీద ఆధారపడి కాకుండా స్వరాజ్య పోరాటమునకు దూరముగా వుండడం ద్వారా ఇస్లాం అనుయాయులుగా ఉన్నారనే కారణం మీద ముస్లింలు ఉన్నత కీలకమైన పరవులను బ్రిటిష్‌ యాజమానుల నుండి పొందసాగినారు. అల్ప సంఖ్యాకులకు రణ అను పేరుతో ముస్లింలకు ఇవ్వబడు ప్రభుత్వ ఆదరణ భారత రాజ్యాంగమంతా వ్యాపించిపోయినది. ముస్లిముల మనస్సులకకు ఇత పెద్ద ఎత్తున దురాలోచనల వైపుకు మళ్లిస్తుంటే దానికి వ్యతిరేకముగ గాంధీజీ యొక్క అర్థరహిత నినాదాలు సరిఉజ్జీలు కాలేకపోయినవి. కానీ గాంధీజీ తన ప్రయత్నములను విరమించలేదు.

ఇంకా ఆయన తాను హిందూ ముస్లింల కిరువురికి నాయకుడననే భ్రమలో జీవిస్తూ తాను ఓడిపోయే కొద్ది మరింత విపరీతమైన పద్దతులలో ముస్లింలను ప్రోత్సాహించడంలో నిమగ్నమైనాడు. పరిస్థితతులు మరింత దిగజారి 1925 సంవత్సరమునకు అన్ని విధముల ప్రభుత్వము విజయము పొందినట్లు అందరికి స్పష్టమైపోయింది. కానీ గాంధీజీ అదేదో సామతెలో చెప్పిన జూదగానివలె ఫణము ఎక్కువ చేయసాగిసాగినాడు. సింధును ప్రత్యేక రాష్ట్రము చేయుటకు, వాయువ్య సరిహద్దు రాష్ట్రమునకు ఏర్పాటుచేయుటకు అంగీకరించినాడు. ఇంకా జాతీయ పోరాటములో దాని సహకారమును పొదవలననే భ్రమతో ఒకటి వెంట ఒకటిగా, జ్రాస్వామ్య విరుద్ధంగా ముస్లింలీగు వారి గొంతెమ్మ కోరికలను అంగీకరిచసాగినాడు.

ఈ సమయానికి అలీ సోదరుల పరపతి పూర్తిగా పడిపోగా జిన్నా తిరిగి రంగ ప్రవేశము చేసి ఇరువైపుల నుండి పేరు ప్రతిష్టలు పొందినాడు. అటు ప్రభుత్వము, ఇటు కాంగ్రెసుఏ ప్రత్యేక సదుపాయాలను కలిగించినా స్వీకరిస్తూ మరల కొత్త కోరికలను కోరడము చేయసాగినాడు. సింధును బొంబాయి రాష్ట్రము నుండి వేరు చేయడం, వాయువ్య సరిహద్దు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము జరిగినది. ఇందులో మరల అల్పసంఖ్యాకుల సమస్య ముఖ్యమైన విషయమైనది. గాంధీజీ స్వయముగా మెక్డోనాల్డును కమ్యూనల అవార్డును ఇవ్వమని కోరేటంత వరకు జిన్నా సమైక్య రాజ్యాంగానికి అడ్డుగా నిల్చినాడు. దానితో దేశ విభజనకు మరిత దోహదము చేయబడినది. 1935 రాజ్యాంగ సంస్కరణలో మత ప్రాతిపదికగా సిద్ధాంతాలు మరింత లోతుగా నాటబడినవి. ప్రనతి పరిస్థితిని జిన్నా తనకు వఅలనంత అనుకూలముగ మార్చుకోగల్గినాడు. భారత జాతీయతను బలపరచి స్థిర పరచగల సమక్య బారత దేశ వ్యవస్థ ఓడిపోయినది. ఆ వ్యవస్థ యొడ జిన్నా
యేనాడు సానుభూతి చూపలేదు. మేము అంగీకరిచనూ అంగీకరించము. నిరాకరించనూ నిరాకరించము అనేక పటమైన పదజాలముతో మేము అంగీకరిస్తున్నాము అనే భావము కలుగజేస్తూ కాంగ్రెసు వమ్యూనల్‌ అవార్డుకు మద్దతు కొనసాగించినది.

1939 నుండి 44 యుద్ధ సమయంలో జిన్నా బహిరంగంముగా స్పష్టంగా ఒకే వైఖరి సహృదయము గల తటస్థ వైఖరి అవలంబించి, ముస్లిం హక్కులు అంగీకరింపబడగానే యుద్ధమునకు సహకారమివ్వగలనని వాగ్దానము చేసినాడు. 1940 ఏప్రిల్‌లో అనగా యద్ధము ప్రారంభమైన ఆరునెలల లోగానే తన ద్విజాతి సిద్ధాంతము మీద పాకిస్థాన్‌ కపోరికను బయట పెట్టినాడు. భారతదేశము లోని ప్రతి భాగములోను హిందువులు, ముస్లింలు అధిక సంఖ్యాకులుగానో అల్పసంఖ్యాకులుగానో ఉండవచ్చును, కానీ ఏ రాష్ట్రములో కూడా హిందువులు కాని, ముస్లింలు గాని నిర్లక్ష్యం చేయదగినంత తక్కువ సంఖ్యలో మాత్రము లేరు. అందువలన దేశ విభజన అల్ప సంఖ్యాలు సమస్యను పూర్తిగా పరిష్కరించకనే ఉండిపోతుంది.

(తరువాయి బాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles