(నిన్నటి తరువాయి)
ఆయన భారతదేశమునకు వ చ్చిన మొదటి అయిదు సంత్సరములలో భారత రాజకీయములలో సర్వోత్కృష్టమైన ఏకైక నాయకత్వమును పొందుటకు అంతగా అవకాశములు లేకుండినవి. దాదాబాయి నౌరోజీ, ఫిరోజిషామెహతా, లోకమాన్య తిలక్, గోపాలకృష్ణ గోఖలే మదలగు వారు ఇంకా జీవించివుండినారు. గాంధీజీ ఎంతగా గౌరవింపబడుచుండినను, ఎంత ప్రజాదరణము పొందినను, ఆ ఆరితేరిన రాజకీయవేత్తల సమక్షములో, వయస్సులోను, అనుభవములోను గాంధీ కుక్రవాడుగనే భావింపబడెను.కాని క్రూరవిధి వారినందరిని అయిదు సంవత్సరముల లోగానే రంగము నుండి తొలగించినది. 1920 ఆగస్టులో లోకమాన్య తిలక్ మరణించిన తక్షణమే గాంధీజీ అగ్రశ్రేణికి త్రోయబడినాడు.
విదేశీ పాలకులు తమ విభజించి పాలించు పద్దతిలో మహామ్మధీయుల దేశభక్తిని రూపు చూపుచుండుట వలన, వారిలో సహచరభావమును మాతృదేశము యెడ సమైక్య భక్తిభావమును గట్టి చేయనిదే, ఐక్య జనసముదాయానికి తాను నాయకత్వమును వహించుట అవకాశములు అతి స్వల్పం అని ఆయన గమనించినాడు. అందువలన బ్రిటిష్ వారి చతురతను ఎదురు దెబ్బతీయుటకు ముస్లిం వర్గముల వైపు స్నేహపూర్వక కదలికలను చేస్తూ వానిని బలపరచుకొనుటకు ముస్లింలకు ఉదారమైన, మితిమీరిన వవాగ్దానాలను చేయసాగినాడు. కాని దీనిని ప్రజాస్వామ్య జాతీయ సమరమునకు అనుగుణముగ చేయుచున్నంత వరకు అట్లు చేయుటలో తప్పేమియులేదు. కాని ఐక్యతపై తలపెట్టిన ఈ ఉద్యమములోని ప్రధానాంశమైన దీనిని గాంధీజీ పూర్తిగా విస్మరించినాడు. ఫలితము ఈసరికి మనకు బాగుగా తెలిసివచ్చినది.
బ్రిటిష్ పాలకు, భారత సాధన సంపత్తినుండే, ఎడతెగకుండా ముస్లింలకు ప్రత్యేక సదుపాయములు కలుగజేసి, వివిధ మతవర్గములను విభజించియుంచ గలిగినారు. 1919 ప్రాంతమునకు, ముస్లింలు తనను విశ్వసించుటకు చేయు ప్రయత్నములలో వాగ్దానములు చేయసాగినాడు. ముస్లిలకు చెందవలసిన మొత్తమును నిర్ణయించకుండానే వట్టి చెక్కును చేఆలు చేసి ఇచ్చుటకు వాగ్దానము చేసినాడు. ఈ దేశంలో ఖిలావత్ ఉద్యమనాÊఇన సమర్థించి అందుకు భారత జాతీయ కాంగ్రెసు యొక్క పూర్తి మద్దతును కూడ పొందగల్గినాడు. తాత్కాలికముగ, గాంధీజీ విజయము సాధించినట్లుగానే వుండినది. ప్రముఖులైన ముస్లిం నాయకులంతా గాంధీజీ అనుయాయులాగా మారినారు. 1920, 21లో మహమ్మదాలి జిన్నా రంగములోనికి రాలేదు. అలీ సోదరులు తిరుగులేని నాయకులైనారు. దీనిని ఆశాజనకమైన ముస్లిం నాయకత్వ ఆగమనానికి శుభసూచకముగా గాంధీజీ స్వాగతము పలికినాడు. ఆయన అలీ సో దరులను ఎంతో గొప్పలు చేసినాడు. ఆకాశమునకు ఎత్తి పొగడ్తలు కుప్పించినాడు. ఎడతెరపి లేకుండా ప్రత్యేక సదుపాయములను కలుగజేసినాడు. కాని అతని వాంఛ నేరవేరలేదు. ముస్లింలు మాత్రము ఖిలావత్ నిర్వాహకవర్గమును ప్రత్యేక రాజకీయ మతపరమైన సంఘటనగా రూపొందించుకొని కాంగ్రెసుతో సంబంధములేని ప్రత్యేక అస్తిత్వమును చివరకు నిలుపుకొనినారు.
గాంధీజీ తన హృదయమంతా పెట్టి దేనికైతే అంత విపరీతమైన సందేము ఒడ్డినాడో, ఆ జాతీయ ఐక్యతపై ముస్లింలకు రవ్వంతైనా సద్భావము లేదని మోప్లాల తిరుగుబాటు అతి త్వరలో తెటతెల్లము చేసినది. అట్టి సందర్భములలో ఎప్పుడూ జరిగే విధముగానే, హిందువులపై ఘోర మారణకాండ, అసంఖ్యాకంగా బలవంతపు మతమార్పిడులు, మానభంగలు, దోపిడిలు జరిగిపోయినవి. బ్రిటిష్ ప్రభుత్వము మాత్రము ఏ మాత్రము చలించకుండా ఆ మోప్లా తిరుగుబాటును కొద్ది నెలలలోనే అణచివేసి గాంధీజీకి ఆయన హిందూ ముస్లిం ఐకమత్యపు ఆనందాన్ని మిగిలించింది. ఖిలాణత్ ఉద్యమం విఫలమై గాంధీజీని ఇరకాటంలో పడవేసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదము ఇంకా కొత బలం పుంజుకుంది. ముస్లింలు మరీ మతోన్మాదులైనారు. వీటన్నిటి దుష్ట ఫలితాలను, హిందువులు అనుభవించవలసి వచ్చినది. అయితే ఈ బ్రిటిష్ వారి చతురతను జడియక, గాంధీజీ హిందూ ఐక్యత అనే భ్రమను సాధించడానికి మరింత మొండిగా ప్రయత్నములు సాగించసాగినాడు.
(తరువాయి బాగం రేపు)

ఇది రాజ భాష, దైవ భాషలా ఉన్నది. 2025 లో వార్తాపత్రికలు అంతరించే కాలంలో చదవడం చాతగాని సమయంలో లో ఈ రాజభాష ఎంతకష్టం ఆలోచించండి.
avunu andi. meeru cheppindhi nijame. chadvadam koncham kastame. aithe annati paristhithula valla marathi nundi telugu loki anuvaadham jarigina samayamlo print chesinadhi. “”VANGMULAM” godse sahaja siddamaina avesham prasthutha basha paddathi loki maariste originality pothundi ani ani[inchindhi. meeku kaluguthunna asokaryaaniki anyadha baavinchakandi.