29.1 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం ‘గాంధీ హత్య’

(నిన్నటి తరువాయి)

పాకిస్తాన్‌ను ఇచ్చి యుండకపోతే మన ప్రజలకు స్వాతంత్య్రము వచ్చి యుండదని కొన్ని వర్గాలు చెప్పుచున్నవి. కాని అది పూర్తిగా అక్రమమైన, అస్తయమైన అభిప్రాయముగా నేను గ్రహించినాను. ఇవి నాయకులు తీసుకొనిన చర్యలను సమర్ధించుటకు చెప్పబడే కుంటిసాకులుగా నాకు కనిపించుచున్నవి. స్వరాజ్యము తమ పోరాటము ద్వారానే సాధింపబడినట్లు గాంధేయ విధానవాదులైన నాయకులు తరుచుగా ప్రగల్బములు పలుకూతే వుంటారు. నిజంగా వారు స్వరాజ్యమును గెలుచుకొని ఉండియుంటే, ఓడిపోయిన బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రమునకు ముందు పాకిస్తాన్‌ నిబంధనను పెట్టగలిగి యుంటారనేది హాస్యాస్పదమైన విషయము. గాంధీజీ ఆయన అనుచరులు పాకిస్తాన్‌ ఏర్పాటుకు తమ సమ్మతిని ఇచ్చుటకు ఒకే ఒక కారణమున్నది. ఏమిటంటేÑ ప్రథమంలో తటపటాయింపు, నిరోధములు ప్రదర్శించడం ఆఖరుకు వచ్చేటప్పటికి ముస్లిం కోర్కెలకు లొంగిపోవడం అనే పద్దతికి ఈ మూక అలవాటు పడిపోవడమే.

1947 ఆగస్టు 15వ తేదిన పాకిస్తాన్‌ ఇవ్వబడిరది. ఏ విధంగా? ప్రజలను మోసం చేసి పంజాబు, బెంగాలు, వాయవ్య సరిహద్దు, సింధు మొదలగు ప్రాంతములలోని ప్రజల భావములకు అభిప్రాయములకు ఏలాంటి విలువ ఇవ్వకుండా పాకిస్తాన్‌ ఇవ్వబడిరది. అవిభాజ్యమైన భారతదేశము రెండుగా విభజింపబడి, ఒక భాగములో మతపరమైన రాజ్యము స్థాపించబడినది. ముఇస్లంలు తమ జాతివ్యతిరేక ఉద్యమములకు, చర్యలకు ప్రతిఫలముగా పాకిస్తాన్‌ను పొందినారు. ఒకవైపు జిన్నా కొర్కెలకు లొంగిపోయి తమకుతామే భారతదేశములో ఒక ముస్లిం రాజ్యనిర్మాణమునకు సహాయము చేసి, గాంధీయ విధానవిధేయులైన నాయకులు పాకిస్తాన్‌కు వ్యతిరేకులైన వారిని, దేశద్రోహులని, మతతత్వవాదులని ఎకసెక్కము చేసినారు. ఈ పాకిస్తాన్‌ సంఘటన నా మనో నిబ్బరము తలక్రిందులు చేసినది. అయినప్పటికీ, పాకిస్థాన్‌ ఏర్పాటు తర్వాత నైనా ఈ గాంధీయ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని హిందువుల హక్కుల సంరక్షణ ఏవైనా చర్యలు తీసుకొనివుంటే, ప్రజలకు చేసిన ఘోరమైన మోసము కారణంగా తీవ్రముగ చెదరిపోయిన నా మనస్సును కట్టుబాటులోనికి తెచ్చుకొనుట సాధ్యమై వుండేది. కాని కోట్లాది హిందువులను పాకిస్తాన్‌ దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టి వారిని పాకిస్తాను వదలవద్దని, అక్కడే వుండమని గాంధీజీ ఆయన అనుచరుల సలహాలు ఇవ్వసాగినారు. ఆ విధముగా హిందువులు అకస్మికముగా ముస్లిం పాలకుల చేతిలో చిక్కిపోయినారు. ఆ పరిస్థితులలో హోరమైన విపత్తులు వరుసగా జరిగిపోయినవి. ఈ జరిగిన విషయములను నా మనస్పులోనికి తెచ్చుకొన్నప్పుడు ఈనాడు కూడా నా దేహము జ్వలితజ్వాల వల్ల కలిగే భీతావహాన్ని పొందుతున్నది.

హిందువులు సామూహికంగా చంపబడడం, 15000 మంది శిఖ్కులు కాల్చిచంపబడడం, వందల కొలది స్త్రీలు వారి దుస్తులు చింపివేయబడి నగ్నంగా ఊరేగింపబడడం, హిందూ స్త్రీలు విక్రయ ప్రదేశాలలోబీప పశువుల వలె అమ్మబడడం, ఇటువంటి దారుణవార్తలను ఉదయించిన ప్రతి దినము మోసుకు వచ్చినది. వేలకువేలు హిందువులు ప్రాణములు అరచేత బట్టుకొని పరుగెత్తిపోయినారు. వారు తమ సర్వస్వమును కోల్పోయినారు. 40 మైళ్లు నిడివికి విస్తరించినన శరణార్థులబారు భారత సమాఖ్యవైపు కదిలి వచ్చుచుండినది. జరిగే ఈ ఘోరాలను కేంద్ర ప్రభుత్వము ఏ విధముగ నిరోధించబూనుకొనినది.? ఓహో! ఆకాశము నుండి శరణార్థులపై రొట్టెముక్కలు విసరుట ద్వారానా?

(మిగితా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles