(నిన్నటి తరువాయి)
1938 సంవత్సరములో హైదరాబాదు సంస్థానములో బాధ్యతాయుత ప్రభుత్వమును ఏర్పాటు చేయవలెననే నినాదంతో హిందూ మహాసభ సాత్విక నిరోధము ప్రారంభించినప్పుడు నేను మైదరాబాద్ భూభాగములోనికి ప్రవేశించిన మొదటి స్వచ్చందసేవక దళమునకు నాయకత్వము వహించినాను. నేను నిర్బంధింపబడినాను. ఒక సంవత్సరము కారాగారవాస శిక్ష విధింపబడినది. హైదరాబారులోని అనాగరిక`కాదు, క్రూర ఆరణ్యక పాలనను నేను స్వయముగ అనుభవించినాను. ప్రార్థనా సమయములలో ‘‘వందేమాతరం’’ పాట పాడిన నా నేరమునకకు డజన్లకొలది సేము బెత్తములతో కఠిన దైహిక శిఫక్షను అనభవించినాను.
1943 సంవత్సరములో భాగల్పూరులో హిందు మహాసభ సమావేశమును నేషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ ప్రభుత్వ చర్య అన్యాయము, చట్ట విరుద్దము అయినదిగా భావించి, హిందూ మహాసభ ఆ నిషేధాన్ని ధిక్కరించుటకు నిర్ణయించుకొనినది. సమావేశము జరుగకుండ చూచుటకు ప్రభుత్వము ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకొన్నప్పటికీ సమావేశము జరుపబడినది. నేను ఒక నెలకు పైగా అజ్ఞాతముగా నుండి ఈ సమావేశము జరుపుటకు కావలసిన ఏర్పాట్లను చేయుటలో ప్రముఖ పాత్ర వహించినాను. ఈ కాలములో నేను వార్తా పత్రికలు చదువునప్పుడు నేను నిర్వర్తించుచుండిన కార్యక్రమమును ప్రశంసించు వార్తలను చూచినాను. ప్రజాహిత జీవనములో నా పాత్రను అమోదిస్తూ ప్రజలు మాట్లాడడం కకూడా నేను విన్నాను. సహజంగా నేను ఉద్వేగ ప్రవృత్తి గల వ్యక్తిని కాను. నిందుతుడిగా నుండి ప్రభుత్వ సాక్షిగా మారిన బాడ్గే తన వాంగ్ములంలో నేను బోపట్కరును పొడిచివేయుటకు ఒక కత్తిని బయటకు తీసినట్లు చెప్పినాడు. ఈ ప్రకటన పూర్తిగా అసత్యము. ఇప్పుడు భోపట్కపరు నిందితులవైపు వాదించు న్యాయవాదులకు నాయకత్వము వహిస్తున్నాడు. ప్రభుత్వమువైపుకు మారిన సాఫక్షి వర్ణించినట్లు దౌర్జన్యము జరిపివుంటే ఈనాడు మా రక్షణకై మాకు సహాయము చేయుటకు ముందుకు వచ్చియుండే వాడా? అట్లు ఆపాదింపబడిన సంఘటన నిజమే అయివుంటే నేను బొపట్కరు సహాయము పొందుటను గూర్చి ఆలోచించి కూడా వుండను.
నన్ను స్వయంగా ఎరిగినవారు నన్ను ఒక సాత్విక స్వభావము గల వాడుగా భావిస్తారు. కాని ఎప్పుడైతే కాంగ్రెసులోని ఉత్తమ శ్రేణి నాయకులుగా గాంధీజీ సమ్మతితో మనము పూజనీయమైన దేవతగా భావించే దేశమును విభజించి ముక్కలు ముక్కలుగా చేసినారో అప్పుడే నా మనసు ఆగ్రహ జ్వలితమైన ఆలోచనలతో నిండిపోయినది.
నేను కాంగ్రెసుకు శత్రువును కాదని స్పష్టమ చేయగోరుతున్నాను. దేశము యొక్క రాజకీయ ఉన్నతికి పాటుపడే ప్రధానమైన సంస్థగా ఆ పక్షమును గూర్చి నేను ఎల్లప్పుడు భావిస్తూ ఉండినాను. దాని నాయకులతో నాకు విభేదములు వుండినవి. ఉన్నవి కూడా. ఈ విషయమును నేను వీరసావక్కరుకు 1933 ఫిబ్రవరి 28 తేది నా సాక్షరాలతో వ్రాసి చేవ్రాలు చేసిన లేఖలో స్పష్టముగా చూడవచ్చును.
(మిగితా రేపు)
