(నిన్నటి తరువాయి)
గాంధీజీ ప్రోద్బలముపై 1942 అగస్టు 8వ తేదీన కాంగ్రెసు ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమమును ప్రారంభించునప్పుడు, వారు దానిని ప్రారంభించక ముందే ఇంచుమించు అందరు నాయకకకులను ప్రభుత్వము నిర్బందించినది. ఉద్యమము అహింసాయుతముగ వున్నంతవరకు మొదట్లోనే తుంచి వేయబడినది. కాంగ్రెసులో ఇంకొక వర్గము వారు అజ్ఞాతములోనికి పోయినారు. ఈ వర్గమువారు గాంధీజీ పద్దతులను తుచ తప్పకుండా అనుసరించి, జైళ్పకు పోయిన వారుకారు. అందుకు వ్యతిరేకముగా ఈ వర్గము సాధ్యమైనంతవరకు కారాగారములకు పోకుండా తప్పించుకొని, యాన సౌకర్యములను, వార్తాహర సంబంధములను శేధించుట ద్వారా, దహన కాండలు, దోపిడీలు ఇతర హింసా కాండలను అవసరమైతే హత్యలతో సహా సాగించి ప్రభుత్వమునకు ఎంత వీలైతే అంత నష్టమును కలిగించదలచినారు. ‘‘సాధించండి లేక మరణించండి’’ అని గాంధీజీ ప్రలను ఉద్భోదించుచు చేసిన ప్రకటన తమకు అన్ని విధములైన అటంకములను తొలగించి రహస్య విధ్వంసకాండలను జరుపుటకు పూర్తి స్వేచ్ఛ నిచ్చినట్లుగా ఈ వర్గము వారు భాష్యము చెప్పుకొనినారు. నిజానికి కూడా, ప్రభుత్వపు యుద్ధ ప్రయత్నములన్నిటిని స్థంభింపచేయుటకు చేయవలసిన కార్యములనెల్ల చేసినారు. పోలీసు స్టేషనులను తగులబెట్టినారు. తంతి తపాలా వార్తాసంస్థల ఏర్పానట్లు దౌర్జన్యముతో బంధింపబడినవి. ఉత్తర బీహారు మొదలగు ప్రాంతాలలో 900 రైల్వే స్టేషన్లు తగులబెట్టడుటో ధ్వంసము చేయుటో జరిగినది. ప్రభుత్వము మాత్రము కొంతకాలము వరకు స్థంభించిపోయినది.
ఈ చర్యలన్నీ కాంగ్రెసు అహింసా సిద్ధాంతానికిచ సత్యాగ్రహ పద్దతికి పూర్తిగా విరుద్దమైనవి. ఉద్యమములో తర్వాత తర్వాత జరుపబడిన చర్యలను గాంధీజీ అటు సమర్థించలేకపోయాడు. ఇటు వ్యతిరేకించలేకపోయినాడు. వాటిని సమర్తించిన ఆయన అహింసా సిద్ధాంత యదార్థ స్వరూపము బయట పడిపోతుంది. వ్యతిరేకించినాడా బ్రిటిష్ వారిని హింసా పద్ధతులలో వెడల గొట్టవలెనా? లేక అహింసా మార్గములేనే వెళ్లిపోవునట్లు చేయవలెనా అనే తర్జన భర్జనలకు వీసమంత ప్రాధాన్యత ఇవ్వని జనావళిలో అప్రీతినిరాదరణ పాలైతాడు. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమము ఇతర అన్ని విషయముల కన్నా కాంగ్రెసు అభిమానులు జరిపిన దౌర్జన చర్యలకే ప్రాచుర్యము పొందినది. ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమము ప్రారంభమైన కొద్దివారములలోనే గాంధీజీ యొక్క అహింసా నిర్జీవమే అయినది. ఆ పేరుతో జరిగిన హింసా కాండ ఆయన అభిమానుల యొక్క చర్యలలో గాంధీజీ దృక్పథము పూర్తిగా మృగ్యమయినది.
(మిగతా రేపు)
