23.4 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

తల్లిదండ్రుల్లారా…జాగ్రత్త!

తెలంగాణ సామ్నా బ్యూరో: మైనర్‌ బాలికలను వలవేసి మోసం చేసి వ్యభిచార రొంపిలోకి దింపే మూఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనతో బాలికలే టార్గెట్‌గా కొందరు చేస్తున్న వ్యాపారాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం వుందన్న వాదన వస్తున్నది. తమ బిడ్డలు సక్రమంగానే స్కూల్‌కు, కాలేజీకి వెలుతున్నారు అని నమ్మడం కంటే వారిని ప్రత్యక్షంగా గమనిస్తే బావుంటుందని చాలా మంది చెబుతున్నారు.


మైనర్‌ అమ్మాయిలతో అబ్బాయిలు చేస్తున్న డ్రగ్స్‌ అండ్‌ సెక్స్‌ దందాను నర్సంపేట పోలీసులు చేధించి నిందితులను అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా మైనర్‌ బాలికలను ట్రాప్‌ చేసి వారికి గంజాయి, మద్యం అలవాటు చేసి ఆ తరువాత వారితో వ్యభిచారం చేయిస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తున్నది. బాలికలు పూర్తిస్థాయిలో గంజాయికి అలవాటు అయిన తరువాత వారిని నర్సంపేట తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం.ముఠాలోని కీలక నిందితులు అబ్దుల్‌ అఫ్నాన్‌, శైలానీబాబా, మహమ్మద్‌ ఆల్తాఫ్‌, లత, నవ్య, మీర్జా ఫైజ్‌ బేగ్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు.


(అమ్మాయిల పట్ల తల్లిదండ్రలు మాత్రమే శ్రద్ధ తీసుకోవడం కాదు. సమాజం కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వుందన్న వాదనలు వస్తున్నాయి. అనుమానస్పద పరిస్థితుల్లో ఏ బాలికైన కనిపిస్తే మాకేం సంబంధం మా అమ్మాయి అయితే కాదు కదా అని ఆలోచించకుండా ఆ బాలిక విషయంలో పూర్తి సమాచారం తెలుసుకొని వీలైతే వారి ఇంటికి ఫోన్‌ చేసి చెప్పడం, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం లాంటివి చేసే బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం వుందని అంటున్నారు. దీని ద్వారా కొంతలో కొంత బాలికకు, తద్వారా ఆ బాలిక కుటంబానికి మేలు చేసిన వారు అవుతారు అనే అభిప్రాయం వస్తున్నది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles