నిన్నటి తరువాయి
కాంగ్రెస్తో ముస్లింలీగు తెగతెంపులు:
ప్రతి ఓటమితో గాంధీజీకి తన పద్ధతిలో హిందూ ముస్లిం ఐక్యత సాధించవలెననే పట్టుదల ఎక్కువైనది. అమితముగ నష్టపోయిన జూదగాని వలె, ఆయన నిస్పృహలో ప్రతీసారి తన పణమును పెంచుతూ, జిన్నాను సంతృప్తి పరచి, స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ నాయకత్వంలో ఆయన సహకారాన్ని సంపాదించుటకు వీలౌతుందనుకుంటే ఎటువంటి హేతుబద్ధము కాని కోర్కెలనైనా సరే ఒప్పుకొంటూ పోసాగినాడు.
కానీ సంవత్సరములు జరిరగే కొద్దీ ముస్లింలు కాంగ్రెసు నుండి దూరమైపోతూ వుండి 1928 సంవత్సరము వచ్చునప్పటికీ ముస్లిం లీగు కాంగ్రెసుతో ఎలాంటి సంబంధమును గాని వుంచుకొనుటకు నిరాకరించిరి. 1929లో కాంగ్రెసు లాహోరు సమావేశములో స్వాతంత్య్ర తీర్మానమును అమోదించు సందర్భములో ముస్లింలు అందులో లేకపోవడం, కాగ్రెసు సంస్థనుండి కట్టుబాటుగా దూరమవ్వడం కొట్టొచ్చినట్లు కనిపించింది. దీని తర్వాత హిందూ ముస్లిం ఐక్యతపై ఎవ్వరూ ఆశ పెట్టుకొనలేదు. అయితే గాంధీజీ మాత్రం ఇంకా దృఢమైన ఆశావాదిగా కొనసాగుతూ ముస్లిం మతోన్మాదానికి ఇంకా ఇంకా లొంగిపోసాగినాడు.
రౌండు టేబుల్ సమావేశము: కమ్యూనల్ అవార్డుÑ భారతదేశములోను, ఇంగ్లండులోను వుండే బ్రిటష్ అధికారులు, తాము ప్రవేశపెట్టిన నీతిబాహ్యమైన విభజించి పాలించు సిద్ధాంతం, దానివలన సంభవంచిన మతవిభేదాలు, వీటన్నిటి ఫలితాలు కూడా భారతదేశములో బ్రిటిష్ పాలనను శాశ్వతంగాను క్షేమంగానూ కొనసాగడానికి దోహదం చేయవని, భారతదేశంఓ ఇంకొక విడతగా నిజమైన, ఉదారమైన రాజ్యాంగ సంస్కరణలు రావలెననే ఒత్తిడి, అలజడి, నిరాకరించ వీలులేనంతగా అధికమైనాయని గ్రహించినారు. అందువలన 1929 లో ఒక రౌండు టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటకు నిశ్చయించుకొని, మరునటి సంవత్సర ప్రారంభంఉలో దానిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించినారు. అప్పుడు రామ్సేమెక్డోనాల్డు బ్రిటిష్ ప్రధానమంత్రిగా వుండినాడు. కార్మికపక్షము అధికారములో వుండినది. కానీ ఈ చర్య తీసుకొనుటలో అప్పటికే అలస్యము జరిగినది. పై ప్రకటన జరగిన ఒక నెల తర్వాత లాహోరు సమావేశంలో కాంగ్రెసు స్వాతంత్య్ర తీర్మానాన్ని ఆమోదించి రెండు టేబుల్ సమావేశాన్ని బహిష్కరించుటకు నిర్ణయం తీసుకొనినది. దాని తర్వాత కాంగ్రెసు ఉప్పు సత్యాగ్రహమును కూడా ప్రారంభించినది. ఈ ఉద్యమము ప్రజలలో అమితమై ఉత్సాహమును కల్గించినది.
(మిగతా రేపు)
