తెలంగాణ సామ్నా బ్యూరో: అల్లుడు వినయ్ కుమార్ నుండి వచ్చిన ఫోన్‌ను ఎత్తిన ఆ అత్తమ్మ గుండె జల్లుమనే మాటలు అల్లుడు చెప్పాడు. ‘‘అత్తమ్మ మీ కూతురు శిరీష చనిపోయింది. గుండెపోటు వచ్చింది’’ అని చెప్పాడాల్లుడు. శిరీష తల్లిదండ్రులకు ఆ మాటలు విన్న తరువాత వారి గుండె జారిపోయింది. ఏడుస్తూ హైదరాబాద్ ప్రయాణం అయ్యారు.
వినయ్‌కుమార్ శిరీషలు హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసముంటారు. వారికి ఒక పాప వుంది. భార్య చనిపోయిందని శిరీష తల్లిదండ్రులకు తెలిపిన తరువాత కొద్ది గంటల్లోనే శిరీష బౌతికకాయాన్ని వినయ్‌కుమార్ సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. దీనితో అనుమానం వచ్చిన శిరీష తల్లిదండ్రులు తమ కూతురు మరణంపై అనుమానాలు వున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో శిరీష బౌతికకాయాన్ని తరలించే ప్రయత్నాన్ని పోలీసులు ఆపించేశారు. శిరీష శరీరంపై గాయాలు వుండడం వారి అనుమానాలు మరింతగా పెంచింది. తమ కూతురుని చిత్రహింసలు చేసి చంపి గుండెపోటు అని వినయ్‌కుమార్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త వినయ్ కుమార్‌ది శ్రీశైలం దగ్గరలోని దోమలపెంట
