36.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

‘‘చావా’’ అంటే పులిబిడ్డ

తెలంగాణ సామ్నా డెస్క్‌: భారతదేశ వెండితెర చరిత్రను తిరగరాస్తున్నదో ఒక సినిమా. ఆ సినిమా పేరు ‘‘చావా’’. పులిబిడ్డను మరాఠీలో ‘‘చావా’’ ని పిలుస్తారు. చావా శంభాజీ, ఆ పులి చత్రపతి శివాజీ. ఇక్కడ నటులు నటీమణుల పేర్లు అవసరం లేదు. ఎందుకంటే ఏ నటుడు వెండితెర మీద కనిపించడు. కేవలం చరిత్ర మాత్రమే కనిపిస్తుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. వందలాది సంవత్సరాలుగా బలవంతంగా నొక్కివేయబడ్డ చరిత్ర. హిందువీరుల చరిత్ర.

ఆ చరిత్రను బయటకు తీసి వాస్తవాన్ని సినిమా రూపంలో ప్రజలకు పరిచయం చేశారు. దర్శకనిర్మాతలు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, అంచనాలు లేకుండా, భాక్సాపీసు పీచు కాకరకాయ లాంటి ప్రచార హోరు లేకుండా ఎప్పుడు ముహుర్తం షాట్‌ కొట్టారు? ఎప్పుడు చిత్రికరించారు? ఎప్పుడు విడుదల చేశారు అన్నట్టుగా అనిపించిన ‘పులిబిడ్డ’ థియెటర్లలో కనిపించిన తరువాత సంచనాలు సృష్టిస్తున్నది. దొంగ పనులు చేసే హీరో క్యారెక్టర్లకు ఆ నటుడు అపుడు తుమ్మాడు, ఈ నటి ఇప్పుడు నవ్వింది వారు రెమ్యూనరేషన్‌ అంత తీసుకున్నారు అనే ప్రచారం అవసరం వుంటుందేమో కాని ఒక అద్భుత అవిష్కరణ బయటకు వస్తే ప్రజలే స్వచ్చందంగా తమకు తామే ఆ సినిమాను స్వంతం చేసుకొని ప్రచారం చేస్తారనడానికి ‘‘చావా’’ ఒక తాజా ఉదహరణ.

ఈ సినిమా కథ పాతదే. చిన్నగా చెప్పాలంటే శివాజీ మహరాజ్‌ బౌతికంగా దూరం అయ్యాకా ఆ బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు ఈ నేలను, ధర్మాన్ని రక్షించడానికి చత్రపతి శంభాజీ చేసిన వీరోచిత సాహసకృత్యాల సముహరమే ‘‘చావా’’. ఆ సమయంలో ఔరంగజేబు అనే ముస్లిం రాజు భారతదేశాన్ని తన వశం చేసుకొని ముస్లిం వశం చేసుకోవడానికి చేసిన విశ్వప్రయత్నాన్ని శంభాజీ ఏ విధంగా అడ్డుకున్నాడు? ఏ విధంగా అతనితో యుద్ధం చేశాడు? ఏలా ధర్మాన్ని కాపాడాడు అనే ఇతివృత్తంతోనే సినిమా వుంటుంది. శంభాజీ చేసిన యుద్ధాలతో పాటుగా ఒక ‘‘కోవర్ట్‌’’ ఇచ్చిన సమాచారం మేరకు శంభాజీతో అతని మంత్రిని బంధీని చేసి తమ మతంలో కలవమని ఎన్ని చిత్రహింసలు చేసిన తలొగ్గని వైనం కళ్ల ముందు కనిపిస్తే ప్రేక్షకుల్లో ఆలోచన మొదలు కావడం తథ్యం. సంచెడు బియ్యానికి, ఆటో కొనిస్తారు. ఎన్ని తప్పులు చేసినా అన్ని మాఫీ అని చెప్పగానే మతం మారేవారు ఒకప్పుడు ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడడానికి మన పూర్వీకులు ఎంతగా త్యాగం చేశారో ఈ సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వస్తున్నది. దశల వారిగా రోజుకు కొంత ప్రాణం వున్న శరీరం నుండి చర్మాన్ని వొలిచినా ‘‘హరహర మహదేవ్‌’’ అనే నినాదంతోనే వారికి సమాధానం చెప్పిన శంభాజీ, బ్రతికుండగానే కనుగుడ్లు పెకిలించినా కదలని, వదలని ధైర్యం, దమ్ము శంభాజీ సొంతం. శంభాజీ జీవితం ఒక స్పూర్తివంతమైన చరిత్ర. భారతీయులందరు సగర్వంగా ప్రమోట్‌ చేయాల్సిన సినిమా ‘‘చావా’. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులు ఆయా పాత్రల్లో జీవించారు. ప్రత్యేకంగా ఏ ఒక్కరి గురించి వాస్తవంగా వివరణ అవసరం లేదు. ఎందుకంటే కథ అలాంటిది.

దేశరక్షణకు, ధర్మరక్షణకు అనాడు ఒక్కొక్క హిందువు ఏ విధంగా తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి పోరాడారో ఈ చిత్రం చెబుతుంది. చరిత్ర పుటల్లో ఇలాంటి వీరుల అనవాళ్లు, వివరాలు ఒక అక్షరం అయిన కనిపిస్తే చాలు ఆ అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని భారతీయ హిందు సింహలు ఎక్కడ గర్జిస్తాయి అని భయపడ్డారో ఏమో కాని చరిత్ర పుటల్లో శంభాజీ లాంటి ఎందరో వీరుల జీవిత చరిత్రను అప్పటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిపేశాయి అనే విమర్శ వుంది. సినిమా అంటే నటీనటుల ప్రదర్శనను, 24 ఫ్రేముల గొప్పతనాన్ని పొగడడం లేదా విమర్శించడం రివాజు. కాని ఒక చరిత్రను గమనించడం, తద్వారా చరిత్రను తెలుసుకోవడం అనే సందర్భాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. ‘‘కాశ్మీర్‌ ఫైల్స్‌’’ సినిమా నుండి ప్రారంభమైనట్లు కనిపిస్తున్న ఈ ఉత్తేజపూరితమైన ప్రదర్శనను తారాస్థాయికి తీసుకొచ్చిన ఘనత ‘‘చాతా’’దే అని చెప్పవచ్చు.

ఎప్పడు బావిలో కప్పలా “నేను సెక్యులరిస్టును” అని చెప్పుకునే కుహనా పౌరులు ‘‘చాతా’’ను చూస్తే ఆనాటి వీరులు ధర్మంకోసం, దేశంకోసం తమ జీవితాలను ఏ విధంగా త్యాగాలు చేశారో ఆర్థమవుతుంది అనే వాదన వస్తున్నది. ఎందరో వీరులు చేసిన బలిదానాల పరంపరను నేటి యువతకు ప్రభుత్వం ఎలాగు అందించడం లేదు. కనీసం ఇలాంటి సినిమాలైనా జనంలోకి వస్తే భవిష్యత్తుకు కొంతలో కొంత ఉపయోగకరంగా వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయ చలనచిత్రాల స్థితిగతుల్ని మార్చే ఎన్నో సినిమాలు వచ్చాయి. వేటికి అవే ప్రత్యేకం. కాని ఇలాంటి సినిమాలో మటుకు నూటికో కోటికో ఒక్కటి అని మాత్రం చెప్పవచ్చు. ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమా. చూడమని చెప్పాల్సిన సినిమా. చూసి సినిమా గురించి చర్చించాల్సిన సినిమా ‘‘చావా’’.

గమనిక: తనలో జాతీయత ఏ స్థాయిలో వుందో తెలసుకోవాలంటే ‘‘చావా’’ను చూస్తే చాలు. ఎన్నిసార్లు మన గుండె బరువెక్కుతుంది. ఎన్నిసార్లు తెలియకుండానే కన్నీళ్లు జలజల రాలుతాయి. ఎన్నిసార్లు రోమాలు ఆవేశంతో నిక్కబోడుచుకుంటాయి తేలుతుంది. అలాగే దేశశక్తి ఏ స్థాయిలో వుందో కూడా తెలిపోతుంది అని చూసిన వారు చేస్తున్న కామెంట్‌. మీరు కూడ చూడండి. మీ కామెంట్‌ తప్పక పోస్ట్‌ చేయండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles