36.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

నాథురాం గోడ్సే “వాంగ్ములం”

(నిన్నటి తరువాయి)

పైన తెలిపిన విధంగా గాంధీజీ రాజకీయ జీవితమును మూడు శీర్షికల క్రింద విభజింపవలసి యున్నది.

  1. 1915 నుండి 1939, 40 మధ్యకాలముః
  2. మహాత్మాగాంధీ నాయకత్వంలో జిన్నాకు దాస్హోం చేసి పాకిస్థిన్‌కు సమ్మతించిన 1939 ,40 నుండి 1947 జూన్‌3, మధ్యకాలం
  3. దేశ విభజన జరిగన దినము నుండి పాకిస్థాన కు 55 కోట్ల రుపాయలు ఇచ్చుటతో ముగిసిన ఆయన అమరణ నిరాహారదదీక్ష, తదుపరి మరికొద్ది కాలములోఅయన మరణమునకు మధ్యకాలము

1914 అంతములో గాంధీజీ శాశ్వతంగా స్థిరపడిపోవుటకు భారత దేశమునకు వచ్చివేసినప్పుడు, దక్షిణాఫ్రికా భారతీయులకు సాహసోపేతమైన
నాయకత్వమును చేకూర్చిన ఘన సత్కీర్తిని తన వెంట తెచ్చుకొనినాడు. భారతజాతి గౌరవమున నిలబెట్టి రక్షించుటకు, శ్వేత జాతీయుల నిరంకుశత్వమునకు వ్యతిరేకముగ ఆ దేశపు పౌరసత్వమును పొందుటకు మనకు గల హక్కులను సాధించుకొనుటకుగా సాగిన పోరాటంలో అగ్రగామిగా నిలచినాడు. హిందువులు, ముస్లింలు, పార్సీలు అనే భేదము లేకుండా అందరూ ఆయనను గౌరవించినారు. ఆయన మాటను శిరసావహించినారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులకెల్లరికి ఏకైక నాయకుడని అతనిని అన్నివైపుల నుండి కీర్తించినారు. అతని సామాన్యమైన జీవనవిధానము, తనదిగాఇ తాను ఎన్నుకొనన ఆదర్శము యెడ అతని స్వార్థరహితమైన భక్తి శ్రద్ధలు, జాత్యహంకారముతో పోరాడుటలో అతని స్వార్థత్యాగము పటుటదల భారతీయుల గౌరవమున పెంపొందించినది. వీని వలన భారతదతేశములో కూడా తనన్ను తాను అందరికి ప్రేమాస్పదుడుగా చేసుకొనినాడు.

తన దేశస్థులకు స్వాతంత్య్ర పోరాటములో, సేవ చేయుటకు ఇక్కడికి వచ్చినపుడు న్యాయముగనే, ఆఫ్రికాలో వలె కుల మతభేదముల కతీతముగ అన్ని వర్గముల అకుంఁఠిత విశ్వాసమును, గౌరవమును పొందగలనని ఆశించినాడు. కాని ఆయన త్వరలోనే ఈ ఆశాభావము నుండి నిరాశాభావమును పొందవలసి వచ్చినది. దక్షిణాఫ్రికాలో భారతీయులు, తమకు నిరాకరింపబడిన పౌరసత్వములోని ప్రాథమిక హక్కులను తప్ప ఇంకేమీ కోరియుండలేదు. వారిలో, అందరికి సామాన్యమైన మరియు తీవ్రమైన బాధ ఒకటి వుండినది. బోయర్లు, బ్రిటిష్‌వారు, ఇరువురు వారిని కాలి క్రింద పెట్టవలెనని చూచినారు. అందువలన తమ అందరికి సామాన్యమైన శత్రువును ఎదుర్కొనుటకు హిందువులు, ముస్లింలు, పార్శిలు ఒక్క మనిషిగా సమైసక్యంగా నిలబడినారు. స్వదేశముందు భారతీయుల సమస్యలు వాటికి భిన్నమైనవి. మనము స్వపరిపాలన, స్వయం ప్రభుత్వము, సంపూర్ణ స్వాతంత్య్రముల కొరకు పోరాడుచుండినాము.

హిందూ ముస్లిం విభేదాల పగుళ్లను విభజించు పాలించు సిద్ధాంతముతో మరింత వెడల్పు చేయటతో సహా అన్ని పద్దతుల ద్వారా, మనపై తన పటుటను కొనసాగించుకొనుటకు దృఢ నిశ్చయముతో నుండిన సామ్రాజ్యవాద శక్తిని కూల్పరదోయు ప్రయత్నములో మనముండినాము. ఆ విధముగ గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఆయన పని నల్లేరుపై బండి వలె నుండినది. వివిధ వర్గాల ప్రనయజనాలలో ఏకత్వము సంపూర్ణముగా నుండినందున ప్రతి భారతీయుడు అతని వెనక నిలబడినాడు. కాని, భారతదేశములో మతపరమైన ప్రాతినిధ్యము, ప్రత్యే నియోజక వర్గములు, ఇటువంటివి అనేక సమస్యలు అప్పటికే జాతి యొక్క సమైక్యతను బలహీనపరచినవి, ఇంకా అటువంటవి చాల అవిర్భవించుచుండినవి. అంతేకాదు, ఎలాంటి సంకోచము లేకుండా బ్రటష్‌వారు దుష్టమైన తమ మతపరమైన పక్షపాతమును మొండి పట్టుదలతో కొనసాగించినారు.అందువలన, గాంధీజీ దక్షిణాఫ్రికాలో వలె భారతదేశములో హిందువుల ముస్లింల తిరుగులేని నాయకత్వం పొందటం అసాధ్యమని గమనించినాడు. కాని ఆయన భాఇరతీయులందరికి నాయకుడుగా చలామణి అగుటకు అలవాఉ పడియుండినాడు. మొగమాటం లేకుండా చెప్పవలెనంటే, అనైక్యతతో కూడిన జాతి నాయకత్వం అంటే ఏమిటో ఆయన ఆర్థం చేసుకోలేక పోయినాడు. ఆయన నిష్కపటమైన మనస్సుకు, తమతో తమకు వ్యతిరేకముగ విభజింపబడిన సైన్యమునకు నాయకత్వం వహించడం అనే దానిని ఆలోచించడం కూడా, ఆర్థంలేని విషయంగా అనిపించింది.
(తరువాయి బాగం రేపు… )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles