36.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

నాథురాం గోడ్సే ‘‘వాంగ్ములం’’ గాంధీ హత్య

(నిన్నటి తరువాయి)


ప్రతి చారిత్రక వీరుడు, తన కాలంలో మన దేశంపై జరిగిన దురాక్రమణలను ఎదిరించి విదేశీ మతోన్మాదుల అత్యాచారాల నుండి, దుర్మార్గాల నుండి ప్రజలను రక్షించి, దురాక్రమణల నుండి మాతృభూమిని తిరిగి గెల్చుకొనినాడు. కాని ముప్పయి సంవత్సరములు మించి గాంధీజీ తిరుగులేని నాయకత్వం వహించిన కాలములో ఇంకా ఎక్కువ దేవాలయ విధ్వంసము, మరిన్ని స్త్రీలపై అత్యాచారములు, బలవంతపు, మోసపు మత మార్పిడులు జరిగినవి. అంతేకాదు. దేశములో మూడవ భాగమే పోయినది. అందువలన అతని అననుచరులు, గ్రుడ్డివారు కూడా చూడగల్గిన సత్యాలను, అనగా ఈ మహాత్ముడు శివాజీ, రాణాప్రతాప్‌, గురుగోవిందుల ముందు అంగుష్టమాత్రుడను సత్యమును చూడలేకపోవడం విభ్రాంతిని కల్గిస్తుంది. అట్టి ఆదర్శమూర్తులను, వీరులను ఆయన ఖండిరచడం, ఎంతో మెత్తగా చెప్తే,ఆదొక మానసిక జాడ్యం అని అనవలసి యున్నది.

ముస్లిం దౌర్జన్య చర్యలముందు దేశ విభజనకు పిరికి తనముతో లొంగిపోయి, బ్రిటిష్‌ సామ్రజ్యావాదుల ఆదరణ వలన అధికారము లొనికి వచ్చిన ఈ ముఠా, నూట ఒక్క విపరీత పద్దతులలో గాంధీ చావును తన స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగపరచుకో చూచుచున్నది. అయితే కీర్తి మందిరములో, చరిత్ర వారికి తగిన స్థానమునే ప్రసాదించును. విపరీతమనిపించినప్పట్టికీ, గాంధీజీ సత్యము అహింస పేరిట దేశమునకు చెపఆని దురదృష్టమును చేకూర్చిన హింసాత్మక శాంతిదూత! రాణా ప్రతాప్‌, శివాజీ, గురుగోవిందులు మాత్రము తన దేశ స్వాతంత్య్రమునకు దేశ ప్రజల హృదయమందిరములో నిరంతరము వెలుగొందుచునే యుందురు.

ఇక మందు సూచింపబోవు విధముగ గాంధీజీ కార్యకలాపములను, వీలుగా నుండుటకు, మూడు శీర్షికల క్రింద విభజింపవచ్చును. ఆయన 1914 సంవతసర ప్రాంతములో ఇంగ్లండు నుండి భారతదేశమునకకు తిరిగివచ్చిన వెంటనే ప్రజాహిత జీవనములోని కురికినాడు. దురదృష్టవశాత్తు ఆయన వచ్చి కొద్దికాలములోనే ఫిరోజ్‌షా మెహెతా, ఆయన తన గురువుగా వర్ణించుకొనిన గోపాలకృష్ణ గోఖలే కొద్ది వ్యవధిలోనే మరణించినారు. గాంధీజ అహమ్మదాబాద్‌ వద్ద సబర్మతీ నది ఒడ్డున ఒక ఆశ్రమము స్థాపించుటతో తన కార్యక్రమము ప్రారంభించి సత్యము,అహింసలను తన నినాదములుగ చేసికొనినాడు. అతడు తరచు తాను బహిరంగముగ చెప్పుకొనే సిద్దాంతములకు వ్యతిరేకముగనే పనిచేసేవాడు. ముఖ్యంగా ముస్లింలను సంతృప్తి పరచుటకైతే అట్లు చేయుటకు అణుమాత్రమైన సందేహించేవాడు కాదు. సత్యము, అహింస ఆదర్శములుగా శ్రేష్టమైనవి. క్రియాశీలతలో మార్గదర్శమునకు శ్లాఘనీయమైనవి కాని వాటిని దైనందిన జీవనములో అభ్యాసము చేయవలెనే కాని, గాలిలో కాదు. గాంధీజీ తాను మహాగొప్పగా ప్రచారము చేసుకొనిన ఆదర్శములను తానే బహిరంగముగా భంగపరచిన విషయములను ముందు ముందు వివరిస్తాను.

(ఇంకా వుంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles