(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ స్వయంసేవక్ వెంకట్ రెడ్డి గంగారం(76) గురువారం మృతి చెందారు.
బాల్య స్వయం సేవక్ గా కోరుట్లలో ఆయన సేవలు అందించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.
ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలని కొనసాగించారు.
ఆయన మృతి పట్ల జగిత్యాల జిల్లాలోని ఆర్ఎస్ఎస్ అధికారులు స్వయంసేవకులు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున అంతిమ యాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
