26.7 C
Hyderabad
Thursday, September 17, 2026
No menu items!

కోటి నవదుర్గ దేవాలయానికి ఉత్సవ రథం అందజేత

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)

జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో శుక్రవారం పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలాల సాయిచంద్ దేవాలయానికి నూతన ఉత్సవ రథాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనంజయ్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య రథాన్ని దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలాల సాయిచంద్ మాట్లాడుతూ, “నెల రోజుల క్రితం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఉత్సవ రథాన్ని సమర్పించడం నాకు ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. శివయ్యకు, అమ్మవారికి ఈ విధంగా సేవ చేసే అదృష్టం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు.
దేవాలయ ఉత్సవాల్లో ఈ రథం కీలక పాత్ర పోషించనుందని, భక్తుల ఆధ్యాత్మిక భావనను మరింత బలపరుస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల రవి కుమార్, ఆడెపు నరేష్, జక్కుల ప్రవీణ్, కట్కం వినయ్, అందె రాజ్ కుమార్, రుద్ర విఘ్నేష్, రాడం మహేందర్, గజేంగి మనీష్, బండి సురేష్, అందె రాజేంద్రప్రసాద్ తదితరులు, కలాల సాయిచంద్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles