(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో రోడ్డు భద్రతను కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్సై ఎం. చిరంజీవి మరియు పోలీసు సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచి, చట్టపరమైన చర్యలతో పాటు తగు జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ తరచూ ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సీఐ సురేష్ బాబు కోరారు.

