(తెలంగాణ సామ్నా డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డిల్లీ లిక్కర్ కేసులో పలువురు రాజకీయ నాయకులతో పాటుగా ముద్దాయిలందరికి ఊరటనిచ్చే విధంగా డిల్లీ రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. ఈ కేసులోని నిందుతులందరి పైన సిబిఐ మోపిన అభియోగాలను ఆ కోర్టు కొట్టివేసింది.
రాజకీయ ప్రముఖులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితతో సహా ఆడిటర్ బుచ్చిబాబులపై సిబిఐ దాఖలు చేసిన కేసును కోర్టు సుధీర్ఘంగా విచారించి కేసును కొట్టివేసింది.
కేసు నమోదు దర్యాప్తులో సిబిఐ పనిచేసిన విధానాన్ని కోర్టు తప్పు పట్టింది. సిబిఐ ప్రత్యేక కోఎర్టు న్యాయమూర్తి జితేంద్రసింగ్ 45 రోజుల పాటు విచారణ చేసిన అనంతరం తీర్పు వెల్లడించారు. తెలంగాణకు సంబంధించినంత వరకు కల్వకుంట్ల కవితకు సిబిఐ కేసు కొట్టివేయడమనేది కొంత ఊరటనిచ్చేదనే చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి కవిత 153 రోజుల పాటు పోలీసు కస్టడీలో వుంది.
