
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు “అర్రైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా, డిఫెన్సివ్ డ్రైవింగ్ అంశంపై కోరుట్ల బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు, అలాగే సీటు బెల్ట్ ధరించి కారులో ప్రయాణిస్తున్న వారికి స్థానిక ఎస్‌ఐ ఎం. చిరంజీవి మరియు సిబ్బంది రోజా పూలు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎం. చిరంజీవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అలాగే వాహనాలను ఓవర్ స్పీడ్‌తో కాకుండా నియంత్రిత వేగంతో నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.
ప్రయాణం ప్రారంభించే ముందు తమ కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలను గుర్తు చేసుకొని సురక్షితంగా ప్రయాణం కొనసాగించాలని పోలీసులు కోరారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం. వివరాలకు సంప్రదించండి “బాలె అజయ్” – 9290277727)
