
తెలంగాణ సామ్మా బ్యూరో:‘‘ఏమ్మా ఇపుడు మీ అమ్మ కనిపిస్తే ఆమెను నన్నెందుకు వదిలేసావని కోపగిస్తావా?’’
21 సం. వయసున్న ఓ యువతిని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న ఇది.
ఆ ప్రశ్న విన్న యువతి మౌనంగా వుండిపోయింది. జవాబు లేక కాదు. జవాబు ఎలా చెప్పాలో తెలియక. ఒకవేళ అమ్మే ఆ క్షణంలో కనిపిస్తే అప్పటికప్పుడు ఆ బిడ్డ గుండెల్లో పుట్టే ప్రేమ ఆ అమ్మను చివాట్లు పెడుతుందో, గుండెలు అలిసేలా ఏడుస్తుందో, లేక అమ్మ ఒడిలో చేరి నిశ్శబ్ధంగా నిద్రపోతుందో? చెప్పడం కష్టమెమో!
ఆ తల్లిది బీద కుటుంబం. రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి. దానికి తోడు నలుగురు సంతాసం. వంటమనిషిగా పనిచేసే భర్త భార్య పిల్లలు బరువనుకున్నాడమో! తన మానానా తాను కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. పాపం తల్లి. నలుగురిని పోషించుకునే దిక్కెలేదు. తన రెండు రెక్కలు ఐదుగురి కడుపులు నింపలేకపోయింది. గుక్కెడు గంజికి కూడా ఇబ్బందే పడే పరిస్థితి ఎర్పడిరది. దీనితో ఆ తల్లి తన మాతృత్వపు మమకారాన్ని చంపుకొంది. ఇద్దరిని ఇంట్లో వదిలి మరో ఇద్దరు సంతానాన్ని తీసుకొని వెళ్లిపోయింది. అపుడు ఆ ఇద్దరి వయసు సుమారు సంవత్సరంన్నర పేరు స్నేహ. ఇంకొకని పేరు సోము నెలల పసిగుడ్డు.
తల్లి వదిలిన పిల్లలు మరునాడు తల్లికోసం ఎడ్చిన ఏడ్పులు ఇంటి యాజమాని గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఎంత వెతికిన ఆ తల్లి దొరకలేదు. దీనితో ఆ ఇద్దరు పిల్లల్ని పోలీసులు ఓ ఆనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఇంత వరకు అందరు వుండి అనాథలైన ఆ ఇద్దరు లోకం తెలియని పాపలకు ఓ ఆధారం దొరికినట్లయ్యింది.
ఈ నేపథ్యంలో 2010వ సంవత్సరంలో ఆ ఆశ్రమానికి ఓ స్పానిష్ జంట వచ్చి ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి దేశానికి తీసుకువెళ్లారు. తమ సొంత బిడ్డల్లా పెంచుకున్నారు. అపుడు ఆ పిల్లల వయసు ఐదు, నాలుగు సంవత్సరాలు. కాలం తన పని చేసుకుంటు పోయింది. ప్రస్తుతం వారి ఆ అమ్మాయి స్నేహ వయసు 21, అబ్బాయి సోము వయసు 20. వారిని దత్తత తీసుకున్న వారు గొప్పగా పెంచారు. ఉన్నత విద్యావంతుల్ని చేశారు. దీనితో పాటుగా వారిద్ధరు తమ సొంత పిల్లలు కాదని, తాము ఎక్కడి నుండి ఎలాంటి పరిస్థితుల్లో వారిని దత్తత తీసుకున్న విషయాన్ని ఆ విదేశీ దంపతులు పిల్లలకు చెప్పారు.
దీనితో తన కన్నతల్లిని ఎలాగైనా చూడాలని కూతురు స్నేహ తహతహలాడిరది. తనను తీసుకెళ్లిన భువనేశ్వర్‌కు డిసెంబర్ 19న తన పెంపుడు తల్లితో వచ్చింది. తమను చిన్నతనంలో వదిలిపెట్టిన ఇంటిని చేరుకుంది. అతికష్టం మీద తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వివరాలు మాత్రం దొరకలేదు. దాదాపు మూడు వారాలు తల్లిదండ్రుల కోసం విపరీతంగా వెతికింది. స్నేహకు పోలీసులు కూడా సహయసహకారాలు అందించారు. ఆ కన్నతల్లి కటక్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. కాని ఎక్కడ వుందో తెలుసుకోలేక పోయారు.
అయితే స్నేహ ఈ (జనవరి6) రోజునే స్పేయిన్ వెళ్లాల్సి వుడడంతో తన తల్లికోసం చేస్తున్న అన్వేషణను తాత్కాలికంగా విరమించుకుంది. తాను మళ్లీ మార్చిలో తిరిగి భారతదేశం వస్తానని అపుడు ఖచ్చితంగా తన అమ్మను మిగితా ఇద్దరు సోదర,సోదరీలను కలుస్తానని స్నేహ చెబుతుంది.
పాత కాలపు తెలుగు సెంటిమెంట్ సినిమాకు ఏ మాత్రం సరిపోని విధంగా కనిపించి కంటిచెమ్మలు చెల్లగిల్లేలా కనిపిస్తున్న ఈ బాధకరమైన సంఘటన ఎంతటి వారి హృదయం అయిన తల్లడిల్ల చేస్తుంది. పాలు మరవని ఇద్దరు పిల్లల్ని వొదిలిపెట్టి పోయిన ఆ తల్లిది దయలేని హృదయమా? లేక ఆకలి తీర్చలేని అసహయతనా? అనే ప్రశ్న సామాజిక మాధ్యామాల్లో నడుస్తున్నది.
తనను తన తమ్మున్ని పసిగుడ్డుగా వున్నప్పుడు వొదిలిపోయిన తల్లిపై ద్వేషం పెంచుకోక ఎలాగైనా తల్లిని చూడాలని వచ్చిన స్నేహను అందరు అభినందిస్తున్నారు.

Super story heart touching