తెలంగాణ సామ్న బ్యూరో: ఈ ఫార్మూలా కార్ రేసులో అవకతవకలు జరిగాయన్న కేసులో సోమవారం కేటిఆర్ ఏసిబి ముందు హజరుకానున్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని కేసు కొట్టివేయాలని కేటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కేటిఆర్ ను ఆరెస్ట్ చేయవద్దని కాని విచారించవచ్చని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కేటిఆర్‌ను అరెస్ట్ చేయవద్ధని హైకోర్టు ఏసిబి ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటిఆర్ సోమవారం తమ ముందు హజరు కావాలని ఏసిబి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల వరకు ఏసిబి ముందు హజరవుతాడు. కేటిఆర్ ఏసిబి కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఎర్పాట్లు చేశారు.
అలాగే 7న కేటిఆర్ ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లవలసి వుంటుంది. కేటిఆర్ వరుసగా రెండు రోజులు విచారణకు వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
