
తెలంగాణ సామ్మా బ్యూరో: జనవరి 5వ తారీఖన విజయవాడలో జరిగి విజయవంతమైన ‘‘హైందవ శంఖారావం’’ బహిరంగ సభలో సినీ గేయ రచయిత ఆనంత శ్రీరామ్ చేసి ప్రసంగాన్ని వివాదస్పదం చేయడానికి ఒక వర్గానికి చెందిన మీడియా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అటు అనంత శ్రీరామ్ ప్రసంగం కాగానే ఇక ఈయన పని అయిపోయింది. ఈయనకు ఇక సినిమాల్లో చాన్సులు రావు. పాటలు రాయలేడు అనే విధంగా ఫోకస్ చేస్తూ, ప్రశ్నార్దక ఆర్థాలు వచ్చేలా కొంత మీడియా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు అనంత శ్రీరామ్‌పై నెగెటివిటిని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది.
కొన్ని దశాబ్దాలుగా హిందుత్వంపై కుళ్లు జోకులు వేయడం, హస్యానికి హిందు దేవుళ్లను వాడుకోవడం తెలుగు ప్రేక్షకులకు తెలిసినదే. ఏ ఇతర మతస్థులపై జోకులు వేయడానికి కనీస దైర్యం చేయని తెలుగు సినిమా దర్శకులు, రచయితలు, నిర్మాతలు హిందు దేవుళ్లను కించపరచడమంటే ప్రత్యేక శ్రద్ద చూపెడుతున్న్న క్రమం కనిపిస్తున్నది అనేది వాస్తవం.
ఈ నేపథ్యంలోప తాజాగా ఓ దర్శకుడు ఆతని భార్య కలిసి గొప్ప పేరు తెచ్చుకున్న ఓ సినిమా హీరోను వలలో వేసుకొని మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమా రంగంలో హిందు పేర్లు పెట్టుకొని కొందరు క్రిస్టియన్లు బాహటంగా హిందు దేవుళ్లను కించపరిచే విధంగా సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఆనంత్ శ్రీరామ్ చెప్పినట్లు ‘‘ధమ్ ఆరే ధమ్’’ అనే పాటలో ‘‘హరే కృష్ణ హరే రామ్’’ అని వాడారంటే హిందూ ధర్మాన్ని ఎంతగా హననం చేస్తున్నారని అడగడం, విమర్శించడం, ప్రశ్నించడం ఏ విధంగా వివాదస్పదం అవుతుంది?అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
హిందు దేవతలను విలన్‌లాగా చూపించి, రాక్షసులను మంచి వారిగా చిత్రీకరించే పనులు సినిమా రంగంలో చాలానే జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆనంత్ శ్రీరామ్‌కు యావత్తు తెలుగు హైందవశక్తి సంపూర్ణ మద్ధతు వున్నట్లు సమాచారం. ఒక హిందువు తన ధర్మానికి జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తే నష్టం ఏమిటో ఆర్థం కావడం లేదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
