
(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని పి.బి. గార్డెన్స్‌లో నిర్వహించిన PRBM జూనియర్ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆకాంక్షించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, వారి సేవలను ఆయన హృదయపూర్వకంగా ప్రశంసించారు.
రానున్న పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ శ్రద్ధగా చదవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, సమాజంలో గుర్తింపు పొందేందుకు విద్యే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు.
కులం, మతం అనే తేడాలు లేకుండా అందరూ సమానులేనని పేర్కొన్న ఆయన, ఐక్యతతో ముందుకు సాగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తున్నారని విషయాన్ని గుర్తు చేస్తూ వారి సేవలకు ఆయన ఉదయ పూర్వంగా ప్రశంసించారు. రానున్న పరీక్షలకు ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా చదవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, సమాజంలో గుర్తింపు పొందేందుకు విద్య ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. కులం ,మతం అనే తేడా లేకుండా అందరూ సామానులేనని పేర్కొన్న ఆయన ఐక్యతతో ముందుకు సాగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతులలో ఉందని బాధ్యతయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో P.R.B.M వ్యవస్థాపకుడైన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు .మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి వచ్చిన అతిధి దాసరి రంజిత్ కుమార్ ఆయన కూడా విద్యార్థులను మరియు విద్యార్థి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా కాలేజీ యాజమాన్యం మరియు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
