
(తెలంగాణ సామ్నా డెస్క్)
కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన రాచమడుగు సుగుణమ్మ కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైనారు.
ఈ సందర్భంగా వారి కుమారులైన రాచమడుగు రాజేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు లను బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావు గురువారం కోరుట్ల లోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు రాచమడుగు వెంకటేశ్వర రావు, కథలాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు మల్యాల మారుతి, బీజేపీ సీనియర్ నాయకుడు బద్రి సత్యం అడ్వకేట్ గాంధారి శ్రీనివాస్, మహేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొనారు.
