(బాలే అజయ్ – 9290277727)
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ను సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కమిటీ జాతీయ చైర్మన్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీజీపీకి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కమిటీ ప్రతినిధులు డీజీపీని కోరారు. పోలీస్ శాఖలో పారదర్శకత, బాధ్యతాయుత సేవలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాచార హక్కు దరఖాస్తుల పరిష్కారంలో ఉన్న ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపు వంటి అంశాలపై చర్చించారు.
డీజీపీ సీవీ ఆనంద్ కమిటీ సభ్యుల సూచనలను సానుకూలంగా స్వీకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశ్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవింద స్వామి తదితరులు పాల్గొన్నారు.
