33.2 C
Hyderabad
Thursday, September 17, 2026
No menu items!

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే

(బాలే అజయ్, 9290277727,కోరుట్ల)

కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో గత నాలుగు వారాలుగా తీవ్ర జాప్యం జరుగుతుండటంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు తమ గోడును వెల్లడించారు.

నత్త నడకనా సాగుతున్న కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి స్థానిక సమస్యలను వివరించి తొందరగా పరిష్కరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా – రైతుల గోస వినండి. పెట్టుబడి సాయం ఇవ్వలేరు, సకాలంలో యూరియా ఇవ్వలేరు. రైతు అప్పులు చేసి పంట పండిస్తే, దాన్ని కొనకపోతే కూడా ఎలా?” అని ఆయన ప్రశ్నించారు.
“మీడియా మేనేజ్మెంట్ వదిలి గ్రౌండ్‌లోకి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోండి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉన్న మొక్కజొన్న ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో తడిసిపోతుందనీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యాన్ని పారదర్శకంగా, ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.రైతులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని రైతులకు ఎమ్మెల్యే బరోసా ఇచ్చారు.రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగూతూనె ఉంటుందని ఆయన రైతులకు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బారాస మండల నాయకులు, పట్టణ కౌన్సిలర్లు బారాస కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles