(తెలంగాణ సామ్నా, కథలాపూర్)
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన పిఎసిఎస్ చైర్మన్ ల పదవీ కాలాన్ని కొనసాగించాలని కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో బుధవారం కథలాపూర్ మండల భూషన్ రావుపెట్ పాక్స్ సొసైటీ చైర్మన్ పదవి బాధ్యతలు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్, భూషన్ రావు పెట్ పిఎసిఎస్ చైర్మన్ లోక బాపు రెడ్డి తిరిగి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ మిట్టపల్లి లక్ష్మి గంగారెడ్డి,గుండారపు గంగాధర్, ఆకుల నర్సయ్య, క్యాతం అనంత రెడ్డి, తిపిరెడ్డి శ్రీకాంత్, లోక రాజ రెడ్డి,మరియు గడ్డం దులూర్ రెడ్డి, గడ్డం శేఖర్ రెడ్డి, పురుకుటపు గంగారెడ్డి,సూరనేని వినోద్ రావు, పాక్స్ సీఈఓ సంజీవ్,రాగుట్ల విజయ్ తదితరులు ఉన్నారు.
