(వాసం మృత్యుంజయ, భాగ్యనగర్ సెంట్రల్ బ్యూరో)
ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమే కాదని, చేనేతలకు జీవితమన్నారు. దక్షిణాసియా టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
