
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
సీఐ బి. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఐలాపూర్ రోడ్ రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా డి.డి (డ్రంక్ అండ్ డ్రైవ్) మెషిన్ ద్వారా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని వారు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై జరిమానాలు విధించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాంతకమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ అలిముద్దీన్, హెడ్ కానిస్టేబుల్ ఏ. తిరుపతి, కానిస్టేబుళ్లు ఏ. రాజేశ్వర్, యూసఫ్ ఖాన్ పాల్గొన్నారు.
