(బాలే అజయ్, 9290277727)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యులుగా డా. వై. అనూప్ రావు ను రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు నియమించారు.
కోరుట్ల పట్టణానికి చెందిన డా. అనూప్ రావ్ మెట్ పల్లి కోరుట్ల సబ్ డివిజన్ ప్రాంతంలో ప్రముఖ వైద్యులుగా సుపరిచితులు. వైద్య రంగంలో సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా రంగంలో కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. అనూప్ రావ్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించడంలో కృషి చేసిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబులకు అనూప్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు తిరుమల వాసు, రుద్ర సుజాత, కలాల రాధ సాయిచందు, గూగులోతు శ్రీకాంత్, కోరుట్ల మండల ప్రెసిడెంట్ పంచరీ విజయ్, కోరుట్ల టౌన్ సెక్రెటరీ రాజేందర్, సాగర్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ లింగారెడ్డి, సుధావేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, బేక్కం అశోక్, మ్యాకల గణేష్, తులసి కృష్ణ, మాడవేణి నరేష్, పెండెం గణేష్, రాగంశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు
