
(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మండలంలోని అయిలపూర్, సర్పరాజ్‌పూర్, కల్లూరు మండల పరిషత్ పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. రామకృష్ణ, మండల విద్యాధికారి గంగుల నరేశం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పరాజ్‌పూర్, కల్లూరు పాఠశాలల్లో ఒక్కో తరగతి గది, అయిలపూర్ పాఠశాలలో ఆరు తరగతి గదులను కూల్చివేసేందుకు అనుమతి లభించిందన్నారు. వాటిని తొలగించి అదే ప్రదేశంలో నూతన తరగతి గదులను నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయిలపూర్ సర్పంచ్ రామకృష్ణ, సర్పరాజ్‌పూర్ సర్పంచ్ రాజ్‌కుమార్, కల్లూరు సర్పంచ్ చీట్నేని లత–రమేష్, ప్రధానోపాధ్యాయులు నర్సింహమూర్తి, కిష్టయ్య, నరహరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
