(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా
కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
జాతీయ రహదారి నానుకొని ఉన్న రోడ్డు డివైడర్ క్రాస్ రోడ్స్ వద్ద పాత కారు టైర్లకు ఎరుపు రంగు వేసి స్వచ్ఛ కోరుట్ల అని ముద్రించి డివైడర్లకు జత చేశారు. దీనివల్ల రాత్రిపూట డివైడర్లను గుర్తించడం సులభం అవుతుంది. అలాగే అనుకోకుండా వాహనాలు డివైడర్లను ఢీకొన్న సందర్భాల్లో కూడా టైర్లు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గే అవకాశముంది. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నచోట సూచిక బోర్డులతో పాటు ఇలా పాత టైర్లను రక్షణ కోసం ఉపయోగించడమనే వినూత్న కార్యక్రమం చేపట్టారని సమాచారం. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.
