
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి మరియు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్, వైస్ చైర్మన్ మొహమ్మద్ సాహెద్ ఉల్ అహద్, వార్డు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా కౌన్సిలర్లు, సిబ్బందికి మ్యూజికల్ చైర్ ఆటలు నిర్వహించి ఉత్సాహభరితంగా జరిపారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైర్‌పర్సన్, కమిషనర్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి మహిళ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చైర్‌పర్సన్ తెలిపారు. సృష్టికి మూలమైన మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని, పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయాలు మరియు పర్యావరణంపై అవగాహన కల్పించాలని కమిషనర్ రవీందర్ సూచించారు. కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
