35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని జనసేన పార్టీ హై కమాండ్ సభ్యులు, హైదరాబాద్‌కు చెందిన మచ్చ సుధాకర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా గురువారం కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలలో సమావేశాలు నిర్వహించగా, కోరుట్ల జనసేన నియోజకవర్గ నాయకులు వోడ్నాల రామారావు మచ్చ సుధాకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ముందుగా పార్టీలో ఉన్న జనసైనికులు, వీర మహిళల నుంచి అప్లికేషన్ ఫారమ్‌లు స్వీకరించడంతో పాటు, కొత్తగా పార్టీలో చేరిన వారిని జనసేనలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా
చిలివేరి లక్ష్మి–నరసయ్య దంపతులు, చిలివేరి రమ్య, మనోజ్ కుమార్, కోమ్మనపల్లి లలిత–రాజేందర్, మామిడాల రామేశ్వరి–మహాదేవ్, గట్ల భాగ్యలక్ష్మి–నరసయ్య, పులి అనిల్, లోగిని, దిలీప్, కల్లాల రమేష్ లకు పార్టీ కండువాలు కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వీరి నుంచి స్వీకరించిన అప్లికేషన్ ఫారమ్‌లను హై కమాండ్ ఆధ్వర్యంలో పరిశీలించి, త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ బీ ఫార్ములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మచ్చ సుధాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వీర మహిళ అడక్ కమిటీ సభ్యురాలు వోడ్నాల సౌజన్య, అడక్ కమిటీ సభ్యుడు చిలువేరి సాయికృష్ణ, మాసం విజయ్, రంజిత్, సంపత్, సంజీవ్, అనిల్, సురేష్, రాజేందర్, శశి, అభినవ్తో పాటు అధిక సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles