
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో గురువారం నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డాక్టర్ల సమావేశంలో తెలంగాణ ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ స్వాతి అనుపరావు ఆధ్వర్యంలో కోరుట్ల మహిళా వైద్య విభాగం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
ఈ ఎన్నికల్లో
అధ్యక్షురాలిగా “డాక్టర్ సునీత రవి కిరణ్”,
ప్రధాన కార్యదర్శిగా “డాక్టర్ గీతా ఇంద్రనీల్”,
కోశాధికారిగా “డాక్టర్ విజయశ్రీ”,
ఉపాధ్యక్షురాలిగా “డాక్టర్ ప్రియాంక”,
సహాయ కార్యదర్శిగా “డాక్టర్ అనురాధ జగదీశ్వర్” ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణకు వ్యాక్సినేషన్‌పై అవగాహన, మహిళా భద్రత, పోషకాహారం, అలాగే యువతికి కెరీర్ గైడెన్స్ అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైద్యులు, ఇతర ప్రముఖులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
