35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్లలో ఘనంగా మార్కండేయ ధ్వజారోహణం

(బాలె అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్డు, మార్కండేయ వీధిలో ఉన్న పద్మశాలి కులొన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని శ్రీ శివ మార్కండేయ కోటీనవదుర్గ దేవాలయ ప్రాంగణంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని బుధవారం ఘనంగా మార్కండేయ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.
ఉదయం 9:30 గంటలకు సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్ ఆధ్వర్యంలో మార్కండేయ ధ్వజాన్ని ఆవిష్కరించి, సామూహికంగా మార్కండేయ జయ నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా గుంటుక ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీ మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న మార్కండేయ స్వామి శోభాయాత్రలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పద్మశాలి కులబంధువులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే శుక్రవారం రోజున ఆలయ 22వ వార్షికోత్సవం మరియు వసంత పంచమి సందర్భంగా ఉదయం 9:30 గంటలకు 108 జంటలతో సామూహిక మహా లింగార్చన, మృత్తిక లింగాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందె రాజ్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనంజయ్, పద్మశాలి జిల్లా నాయకులు రుద్ర శ్రీనివాస్, అంబేరి నాగభూషణ్, మచ్చ కవిత, ముల్క ప్రసాద్ తోపాటు ఆలయ, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.) సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles