
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణం మరియు కోరుట్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.12,46,000/- (పన్నెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు) విలువగల 37 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ గారు మాట్లాడుతూ, పేదలు, అవసరంలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా తాను ఎప్పుడూ కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
