
( తెలంగాణ సామ్నా డెస్క్) కొందరు మహిళలు తాత్కాలిక శారీరక అసకాల కోసం కట్టుకున్న భర్తల్ని చంపుతున్న దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకునేది భర్తను చంపడానికి అన్నట్టుగా వాతావరణం తయారైతుంది అనే విమర్శలు వస్తున్నాయి.
ప్రియుని మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను చంపేందుకు సుఫారి గ్యాంగ్ కు రూపాయలు 35000 ఇచ్చింది. అయితే సుపారి తీసుకున్న గ్యాంగ్ వ్యక్తులు డబ్బు తీసుకున్నాక సదరు భార్య సౌమ్య ఫోను లిఫ్ట్ చేయలేదు. దీనితో సుపారి గ్యాంగ్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని అనుకున్న సౌమ్య ఆమె ప్రియుడు దిలీప్ తో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్త రమేష్ గొంతు నులిమి హత్య చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు సౌమ్యను విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీనితో పోలీసులు సౌమ్య, ఆమె ప్రియుడు తో పాటుగా సుపారి గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ చేశారు. హత్యకు గురికాబడిన రమేష్ ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. అతనిపై సుమారు కొట్టిన రూపాయల జీవిత బీమా ఉండడం వల్ల ఆ డబ్బుల కోసం సౌమ్య రమేష్ ను హత్య చేసిందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ సంఘటన నిజాంబాద్ జిల్లా బోర్గాంలో జరిగింది.
