
(తెలంగాణ సామ్నా డెస్క్)
అమెరికాలోని మేరీ ల్యాండ్ లో తెలుగు యువతీ ఆదివారం దారుణ హత్యకు గురైనట్లు సమాచారం. ఆమె మాజీ ప్రియుడు హో వార్డ్ కౌంటిలోని హెలికాట్ సిటీకి చెందిన అర్జున్ శర్మ నివాసంలో తెలుగు అమ్మాయి నిఖితారావు గొడిశాల అనుమానస్పదంగా మృతి చెందింది. ఆమె వయసు సుమారు 27 సంవత్సరాలు.
కత్తిపోట్లతో అర్జున్ శర్మ నివాసంలో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కను గోన్నారు.
నికిత కనిపించడం లేదని జనవరి రెండవ తేదీన అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు చివరిసారిగా తనను తన అపార్ట్మెంట్లో డిసెంబర్ 31 వ తేదీన చూసానని వెల్లడించాడు. ఈ మేరకు సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసు అధికారులు జనవరి మూడవ తేదీన సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జనవరి మూడవ తేదీన కత్తిపోట్లతో విగతజీవిగా పడి ఉన్న నిఖిత మృతదేహాన్ని అర్జున్ అపార్ట్మెంట్ లో పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31 వ తేదీ సాయంత్రం ఏడు గంటల తర్వాత నికితను అర్జున్ చంపేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ఆరా తీయగా జనవరి 2వ తేదీ సాయంత్రమే అర్జున్ భారత్ కు వెళ్ళిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో అర్జునే నికితను హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
అర్జున్ ఈ హత్య చేసి ఉండొచ్చు అన్న అనుమానంతో పోలీసులు ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ, మర్డర్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు కోవార్డు కౌంటి పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ ను గుర్తించేందుకు ఫెడరల్ ఇన్ఫోసిమెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నికిత హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై భారత దౌత్య కార్యాలయం స్పందించింది వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సహాయాలను అందిస్తామని తెలిపింది. ప్రస్తుతము నికిత కుటుంబము సికింద్రాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తున్నది.
