
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం కోరుట్ల–మెట్పల్లి మండలాల ఆధ్వర్యంలో, జగిత్యాల జిల్లా మేదరి సంఘం సహకారంతో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు మరియు నూతన ఉద్యోగాలు సాధించిన మేదరి కుల సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షులు జొరీగల శ్రీనివాస్, కోన రాజశేఖర్, అలిపిరెడ్డి లచ్చయ్య, ఎల్. నాగరాజు, ఉమా పాల్గొని సన్మానితులను అభినందించారు.
అలాగే జగిత్యాల జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు ఇందూరి గంగాధర్, రమాకాంత్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు చిలివేరి విజయ్, మొలుమూరి మోహన్, మెట్పల్లి అధ్యక్షులు నగూరి రాజేష్, ఊరే నగేష్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
