(నిన్నటి తరువాయి)
గాంధీజీ ప్రకారం, అహింసను ఆచరించడమంటే, దైహిక లేక ఆయుధశక్తితో ఎటువంటి విరోధము చూపకుండ దురాక్రమణదారుడు కొట్టే దెబ్బలను సహించడం లేక అనుభవించడం గాంధీజీ, తన అహింసకు వివరించుటకు ఒక ఉదాహరణము ఇచ్చినాడు. ఒక పెద్ద ఆవులమందలోని ఆవులు ఎంత పెద్ద సంఖ్యలో తమను చంపి కబళించుటకు ఒక పులికి స్వేచ్చ నిచ్చినవంటే, పులి తుదకు చంపడంలో అలసిపోయి అహింసా సిద్దాంతాన్ని అనుసరించదలిచింది. ఇదీ ఆ ఉదాహరణ. ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవలసిన ఒక సంఘటన`కాప్పూరులో ముస్లింల హత్యాంతకమైన దాడికి గణేశ శంకర విద్యార్థి మరణించినాడు. ముస్లింల దెబ్బలకు ఆయన తల ఒగ్గడం అహింసా సిద్దాంతానికై మృత్యవును కౌగిలించుకోవడానికి ఒక ఆదర్శకరమైన ఉదాహరణగా గాంధీజీ తరచుగా ఉదహరించేవాడు. ఉదహరింపబడిన ఇటువంటి అహింస, జాతిని వినాశనము వైపుకు తీసుకుపోతుందని, పాకిస్తాన్ మిగతా భరతదేశములోనికి చొచ్చుకొని ఆక్రమణ చేయుటకు వీలు కలిగిస్తుందనీ, నేను దృఢముగా నమ్మినాను. నమ్ముతున్నాను.
సంక్షిప్తంగా చెప్పాలంటే… గాంధీజీని చంపినందువల్ల నేను సర్వనాశనము అవుతానని ఆలోచించినాను. భవిష్యత్తును స్పష్టముగ చూడగల్గినాను. ప్రజలనుండి ద్వేషాన్ని తప్ప ఇక దేనిని గాని నేను ఆశించలేదు. నా ప్రాణానికన్న అధికముగ నేను తలచే నా గౌరవము పూర్తిగా పోతుందని నాకు తెలుసు. కాని అదేద సమయంలో ఇంకొక విషయమును కూడా తలపోసుకొనినాను. గాంధీజీ పరోక్షములో భారత రాజకీయములు తప్పక ప్రయోజనకరముగను, తిరుగుదెబ్బ తీయగల స్థితిలోను, సాయుధ దళములతో బలవత్తరముగను వుండగలవని భావించినాను. నా భవిష్యత్తు పూర్తిగా నాశనమై పోతుందనే విషయులో నాకు ఏ మాత్రనము సందేహము లేదు. కాని జాతి మాత్రము పాకిస్తాన్ దురాక్రమణ నుండి రక్షింపబడుతుంది. ప్రజలు ననన్ను తెలివి లేని వాడిననో లేక మూర్ఖుడననో నిందిచవచ్చు. కాని జాతి మాత్రము, జాతి నిర్మాణమునకు అవసరమని భావించే హేతుబద్దమైన విధానమును అనుసరించుటకు తగిన స్వతంత్రత పొందుతుంది. సమస్యను తీవ్రముగ ఆలోచంచిన మీదటనే నేను ఒక నిర్ణయము తీసుకొనినాను. అయితే నా నిర్ణయమును గూర్చి ఓ ఒక్కరికి తెలుపలేదు. నా గుండెను దిటవు చేసుకొనినాను. 1948 జనవరి 30వ తేదిన బిర్లా భవనములోని ప్రార్థనా స్థలములో గాంధీజీ పై తుపాకి గుండ్లు పేల్చినాను.
ఇక ఇప్పుడు నేను చెప్పవలసినది ఏమీ లేదు. తన దేశము యెడ భక్తి కలిగియుండటం ఒక పాపమే అయితే నేను అటువంటి పాపము చేసినానని ఒప్పుకుంటున్నాను. అది ప్రశంసింపదగినదైతే ఆ ప్రశంసను నేను పొందగోరుతాను. నేను పూర్తిగా నమ్మి ఆత్మ విశ్వాసముతో ఒకటి చెప్పుతున్నాను. మరణంచవలసిన మానవులచే స్థాపింపబడిన ఈ న్యాయస్థానములకు ఆవల వేరే న్యాయస్థానము వుంటే అందులో నా చర్య అన్యాయమైనదిగా భావింపబడదు. మరణానంతరము చేరుటకు అటువంటి ప్రదేశమేదీ లేని యెడల నేను నిష్కల్మషముగ మానవ శ్రేయస్సు కొరకు మాత్రమే చేసి ఈ కార్యమును గూర్చి ఇక చెప్పవలసినదేమీ లేదు. ఏ వ్యక్తి విదానము, చర్య. లక్షలాది హిందువులకు చిత్రహింసలు, నాశనము, విధ్వంసమును చేకూర్చినవో అట్టి వ్యక్తిపై నాచే తుపాకీ గుండ్లు పేల్చబడినవి.
నిజం చెప్పాలంటే ` గాంధీజీపై నాచే జరుపబడిన తుపాకీ కాల్పులతో బాటు నా జీవితం కూడా అంతమైంది. అప్పటినుండి నేను భావాతీత స్థితిలోను, ధ్యానాయత్త చిత్తముతోను వున్నట్లుగా దినములు గడిపి వేయుచున్నాను. ఈ కాలములో నేను చూచినవి, పరిశీలించినవి నాకు పూర్తి తృప్తి కలిగించినవి.
తరువాయి భాగం రేపు



