నిన్నటి తరువాయిః
గాంధీజీ మరణానంతరము మన ప్రభుత్వము, అనవసరముగ ఆలస్యము చేయుచు, వాయిదాలు వేయబడుచుండిన హైదరాబాదు సమస్యను సరిన పద్దతిలో సాయుధ దళముల నుపయోగించి పరిష్కరించినది. మిగిలిన భారతదేశంలోని ఇప్పటి ప్రభుత్వఉ ప్రయోజనాత్మక రాజకీయముల మార్గమును అనుసరిస్తున్నట్లు కనిపించుచున్నది. మన జాతి ఆధునిక ఆయుధములతో, సంగ్రామ శక్తితో బల సంపన్నమైన సైన్యములను కలిగి యుండెవలెననే దృక్పథాన్ని దేశీయాంగ మంత్రి వెలిబుచ్చినట్లు తెలియుచన్నది. అట్లా చెప్పుచూ ఆ చర్య గాందీజీ ఆదర్శములకు అనుగుణముగా వుంటుందని కూడా చెప్పినాడు.
ఆ విధముగ ఆయన తన తృప్తికొరకు చెప్పుకొని యుండవచ్చు.అది అట్లయ్యే పక్షంలో దేశ రక్షణకై హిట్లరు, ముస్సోలిని, చర్చిల్ లేక రూజ్వెల్ట్ అనుసరించిన పద్దతులకు గాంధీజీ ప్రతిపాదించిన అహింస మీద ఆధారపడిన పద్దతులకు భేదము ఏమియు వుండదనే విషయమును విస్మరించరాదు.
గాంధీజీ జాతికొరకు కష్టముల ననుభవించినాడనే విషయమును ఒప్పుకొనుటకు నేను సిద్ధముగనున్నాను. ఆయన ప్రజల మనస్సులో చైతన్యమును తెచ్చినాడు.ఆయన తన సొంత లాభమునకై ఏమియు చేయలేదు. కాని అన్నివైపులా అహింసా సిద్ధాంతము ఓడిపోయినదని, నిష్పలమైనదని అంగీకరించేటటువంటి హృధయ నైర్మల్యము ఆయనలో లేకపోయినదని చెప్పడానికి బాధపడుతున్నాను. గాంధీజీ చేసి వానికన్న అధిక త్యాగములు చేసిన మేధావులు, శక్తిముంతులు అయిన దేశభక్తుల జీవిత చరిత్రలను చదివినాను. కొంతమందిని నేను స్వయముగ ఎరిగియున్నాను. ఏది ఏమైనా, గాంధీజీ చేసిన సేవలకు ఆ సేవలు చేసిన గాంధీఈకి గౌరవముతో శిరస్సు వంచి సమస్కరించుచున్నాను. నిజమునకు తుపాకీ గుండ్లు కాల్చుటకు ముందు కూడా ఆయనకు గౌరవసూచకముగ అభివందనము చేసినాను. తలవంచినాను. కాని నేను ఒక విషయము మాత్రము ఇప్పటికి గట్టిగా చెప్పుచున్నాను. ప్రజలనమోసము చేసి ఈ దేశమును మాకు పూజనీయమైన ఆ సంపూర్ణ మూర్తినివిభజించుటకు దేశభక్తునికి కూడా హక్కులేదు. కాని ఆయన ఆ పని చేసియే తీరినాడు. ఇటువంటి నేరస్తులను శిక్షించుటకు న్యాయశాస్త్ర బద్దమైన యంత్రాంగము లేదు. అందువలన, నేను చేయగల్గినది అది ఒక్కటే కాబట్టి గాందీజీపై తుపాకీ కాల్పులు జరుపుటకు పూనుకొనినాను.
ఈ పనిని నేను చేయకుండా వుండి వున్నట్లయితే నా మటుకు నాకు మేలుగానే వుండేది. కానీ పరిస్థితులు నా అదుపు తప్పిపోయినవి. నా మనోద్దృతి ఎంత బలముగా వుండినదంటే, ఈ మనిషి సహజ మరణాన్ని పొందకుండా చేయాలి ` దేశములోని మత మౌఢ్యపూరితులైన ఒక వర్గమునకు అన్యాయమైన, జాతి వ్యతిరేకమైన ఆపాయకరమైన పక్షపాతము చూపించినందుకు ఆయన తగిన మూల్యపము చెల్లించవలసి వచ్చినది అని ప్రపంచము తెలుసకోవాలి అని భావించినాను. ఇక ఈ పరిస్థితిని తాము చేయని తప్పుకు జరుగబోవు లక్షలాది హిందువుల హత్యాకాండను, అంతము చేయవలెనని నిర్ణయించుకొనినాను. ఈ పవిత్ర భూమి తనయులకు విపత్కరముగ పరిణమిల్లిన ఆయన అహంకార ప్రవృత్తికి భగవంతుడు ఇప్పుడు ఆయనను క్షమించును గాక.
తరువాయి భాగం రేపు
