(నిన్నటి తరువాయి)
నిజం చెప్పాలంటే గాంధీజీ రాజకీయ రంగములో ప్రవేశించగనే ప్రతిపాధఙంచిన హిందూ ముస్లిం ఐక్యత అనే భావము పాకిస్థాన్ ఎర్పడిన ణమే అంతమై పోయినది. ఎందువలనంటే, భారతదేశమంతా సంపూర్ణమైన ఒకే జాతిగా భావించుటకు ముస్లింలీగు నిరాకరించినది. అంతేకాకుండా తాము భారతీయులము కామని పదేపదే మొండిగా చెప్పుకొన్నారు. గాంధీజీ పలుమార్లు ప్రతిపాదించిన హిందూ ఐకమత్యము ఇటువంటిది కాదు. ఆయన కోరినదేమిటంటే ఇరువురు ఒకే ఆదర్శమునకు కట్టుబడిన స్నేహితులవలే స్వాతంత్య్రమునకై జరిగే పోరాటంలో పాల్గొనడం. అది హిందూ ముస్లిం ఐకమత్యము కోరడంలో ఆయన ఉద్దేశ్యము. హిందువులు గాంధీజీ ఉపదేశమును శిరసావహించినారు. కానీ ముస్లింలు మాత్రము ప్రతి సందర్భములోను దానిని నిర్లక్ష్యము చేయడమే కాకుండా హిందువులను అవంమానము చేసే ప్రవర్తనతో మితిమీరిపోపయినారు. ఇది తుదకు దేశాన్ని ముక్కలు చేసి విభజించుకొనుటతో పరాకాష్ఠకు చేరుకుంది.
గాంధీజీ జిన్నాల నడుమ నుండిన పరస్పర సంబంధములు కూడా గమనించదగియున్నది.ఒకప్పుడు గట్టి జాతీయవాదిగా నుండి జిన్నా 1920 లోను, ఆ తర్వాత పచ్చి మతతత్వ వాదిగా మారినాడు. అప్పటినుంచి ఆయన ఒకే ఒక బహిరంగమైన, స్పష్టమైన విషయమును ప్రతిపాదించినాడు. అదేమిటంటే, ముస్లింల హక్కులను అవసరములను పరిరక్షించుటే ఆయన ధ్యేయము. అందుకై ముస్లింలు కాంగ్రెసు మీద, కాంగ్రెసు నాయకులమీద ఆధారపడరాదు. స్వాతంత్య్ర పోరాటమును ముస్లింలు, కాంగ్రెసు మీద, కాంగ్రెసు నాయకుల మీద ఆధారపడరాదు. స్వాతంత్య్ర పోరాటమును ముస్లింలు, కాంగ్రెసుకు సహకరించి, బలపరచరాదు. తర్వాత జిన్నా పాకిస్థాన్‌ను బహిరంగముగ కోరినాడు. ఇవి తన సిద్ధాంతములకు సంబంధించినంత వరకు ఎవరిని మోసము చేయలేదు. అతనిది ఒక బహిరంగ శత్రువు ప్రవర్తన. అతను దేశవిభజనను గురించి నిమ్మళముగాను, విశృంఖలమైన వాణితోను మాట్లాడేవాడు. ఇందు దాపరికమే లేదు.
గాంధీజీ జిన్నాను పలుమార్లు కలుసుకొనినాడు. ప్రాధేయపడినాడు. ప్రతి తడవ ‘‘సోదరుడు జిన్నా’ అని విజ్ఞాపనము చేసుకొనవలసి వచ్చినది. అఖండ భారత ప్రధానమంత్రిత్వమును కూడా ఇవ్వజూపినాడు. కాని జిన్నా సహకరించేదానికి అనుకూల్యత చూపిన సందర్భము ఒక్కటిగూడా లేదు.
జిన్నా యొక్క ధృడ నిశ్చయమునందు గాంధీజీ అంతర్వాణి, ఆధ్యాత్మిక ఎకంతో గొప్పలు చేసి అహింసా సిద్దాంతము, ఇవన్నీ అట్టలతో చేసిన మేడల వలె కూలిపోయి శక్తిహీనములుగా రుజువు కాబడినవి. తన ఆధ్యాత్మిక శక్తులతో జిన్నాను ప్రభావితము చేయలేనని తెలుసుకొనిన తర్వాత గాంధీజీ తన విధృానమును మార్చుకొని యుందవలసినది లేక ఓటమిని ఒప్పుకొని జిన్నాతోను, ముస్లింలీగుతోను వ్యవహారము నుడపుటకు వేరువేరు రాజకీయ దృక్పథములుగల ఇతరులకు మార్తమ ఉ సుగమము చేసియుండవలసినది. కానీ గాంధీజీ అంత నీతివర్తనము కలవాడు కాడు. జాతి సంక్షేమము విషయములలో కూడా ఆయన తన అహంకారామును స్వార్థమును మరువలేకపోయినాడు. అందువలన ఘోరమైన తప్పిదములు హిమాలయములంత పెద్ద తప్పిదములు, చేయబడుచుండగా ఆచరణయోగ్యమైన రాజకీయములకు అవకాశమే లేకపోయినది.
(మిగితా రేపు)
