నిన్నటి తరువాయి
నవకాళీ సాముహిక హత్యకాండ తర్వాత ఒక సంత్సరంపాటు మనజాతి నెత్తురు మడుగులో స్నానముచేస్తూ వున్నట్ల వుండిపోయినది. మానవ సముదాయముపై దారుణమైన భయంకర హత్యకాండను కొనసాగించగా కొన్ని ప్రాంతములలో హిందువులు ప్రతీకార చర్యలు జరిపినారు. తూర్పు పంజాబు, బీహారు, డిల్లీలపో ముస్లింలపై హిందువులపు చేసిన దాడుల ప్రతీకార చర్యలు మాత్రమే. ఈ ప్రతీకార చర్యలకు ఆలకారణం, ముస్లిం ఆధిక్యత గల రాష్ట్రములలో హిందువులపై ముస్లింలు జరిపిన అత్పాయచరములే అని4 గాంధీజీకి తెలియకపోలేదు. అయినప్పటికీ, గాంధీజీ అట్టి హిందువుల ప్రతీకార చర్యలను మాత్రము ఖండిరచసాగినాడు. ఇక కాంగ్రెసు ప్రభుత్వము ఎంతదూరము పోయినదంటే నవకాళి మరి ఇతర ప్రదేశములలో ముస్లింలు జరిపిన డౌర్జన్యాలు అత్యాచారములు ప్రేరేపించిన అసంతృప్తిని, ప్రతీకార చర్యలను నిరోధించుటకు బాంబుల ప్రయోగము కూడా ఏఏదమని బీహారులోని హిందువలను బెదిరించినది. పాకిస్థాన్‌లోని హిందువులను, శిక్కులను పూర్తి సామూహిక హత్యాకాండకు బలి చేసినప్పటికి, భారతదేశములోని హిందువులు ముస్లిలను గౌరవముతో, ఔదార్యముతో ఆదరించవలయునని, సుహ్రవరి గుండాల నాయకుడైనప్పఇకీ, ఆయనను డిల్లీలో స్వేచ్చగాను క్షమముగాను సంచరించ నీయవలయుననియు గాంధీజీ తన ప్రార్థనలు జరిగే సమయములలో పదేపదే ప్రభోదించసాగినాడు. ఈ కింద ఇవ్వబడిన ఒక ప్రార్థనా అనంతరం ఉపన్యాస భాగము ఈ విషయమును మరింత విశధము చేయగలదు.
హిందువుల ఆస్థిత్వమనే మాలచ్చేదము చేయ నిర్ణయించుకొనినప్పటికీ, హిందువులు మాత్రము ఎప్పుడు ముస్లింల యెడ అగ్రహము చెందరాదు. వారు మనందరిని కత్తికి ఎరచేయబూనిన మనము ధైర్యముతో మరణమును స్వీకరించవలెను. వారు ప్రపంచమునంతటిని పరిపాలించవచ్చును. మనము ఆ ప్రపంచములో నివసించవలసినదే. కనీసము మనము మరణమునకు ఎప్పుడూ భీతి చెందరాదు. జనన మరణములు మనకు విధిదాయకములే. అటువంటప్పుడు దీనికై మనము విషాదమును పొందుట యెందుకు? మనమందరము మన పెదవులపై ధరహాసముతో మరణించేయెడల మనము నవజీవితములో ప్రవేశిసాము. మనము ఒక నూతన హిందుస్థాన్‌ను అవిర్భవింపజేస్తాము. (1947 ఏప్రిల్ 6 వ తేదిన గాంధీజీ ప్రసంగం)
ఈ దినము రావల్సిండి నుండి నన్ను చూచుటకు వచ్చిన కొందరు పెద్దమనుషులు, పుష్టిగాను, దైర్యవంతులుగాను, వ్యాపారములలో నిమగ్నమైన వారుగను వున్నారు. వారిని ప్రశాంతముగా వుండమని నేను సలహా ఇచ్చినాను. ఏది ఏమైనప్పటికిన్ని భగవంతుడే సర్వశక్తిమంతుడు,భగవంతుడు లేనటువంటి ప్రదేశము లేదు. ఆయన మీద ధ్యానము ఉంచండి, ఆయన నామస్మరణ చేయండి, అంతా సవ్యంగా జరుగుతుంది. పాకిస్థాన్‌లో ఇంకా వుండిపోయిన వారి సంగతేమిటని వారు అడిగినారు. నేను వారిని ఇక్కడికి (డిల్లీకి) ఎందుకు వచ్చినారని అడిగినాను. వారు అక్కడనే ఎందుకు మరణించలేదు? ఎవడైనాసరే, మనలను క్రూరముగా హింసిచినప్పటికీ, తుదకు చంపినప్పటకి మన జీవితము గడిపిన ప్రదేశమును అంటి పెట్టుకొని యుండవలెననే నా నమ్మకము ఈ నాటికి దృఢముగా యున్నది. ఆ జనము మనలకు చంపిన మనము చనిపోదాము, అయితే భగవన్నామమును ఉచ్చరిస్తూ ధైర్యముగా మనము చనిపోవాలి. మనవారు చంపబడినప్పటికీ, ఎవరిమీద అయినాగాని, మనము ఎందుకు ఆగ్రహము చెందవలెను? వారు హత్య చేయబడినప్పటికీ వారు మంచిది సరిఅయినది అయిన అంతమును పొందినారని మీరు గ్రహించవలసియున్నది. ఆ దేవుడు మనకెల్లరకు అట్టి అంతమునే ప్రసాదించుగాక. భగవంతుడు మనకు అదేవిధమైన మార్గమును చేకూర్చుగాక. దీనికై మనము హృదయపూర్వకముగ ప్రార్థన చేయవలసియున్నది. వారు తమ ప్రదేశమునకు తిరిగిపోయి అక్కడి హిందు, సిక్కు నిర్వాసితులను పోలీసు, మిలిటరీ సహాయము లేకుండా తమ తమ స్థానములకు వెళ్లవలసినిదిగా సౌమ్యముగా చెప్పమని రావల్పిండి వాసులకు చెప్పినట్లుగానే మీకు సలహా, ఆదేశము ఇచ్చుచున్నాను. (1947 సెప్టెంబరు 23న గాంధీజీ ప్రసంగము)
(మిగితా రేపు)
