నిన్నటి తరువాయి
బ్రిటిష్ వారు ఈ దేశమును వదలుటకు నిజమైన కారణము త్రిముఖమై యున్నది. అందులో గాంధేయ పద్దతి మాత్రం చేరియుండలేదు. ఆ మూడు శక్తులు ఏమంటే:
- 1857 నుండి 1932 వరకు అనగా అలహాబాద్ వద్ద చంద్రశేఖర అజాద్ చనిపోవునంత వరకు జరిగిన భారత విప్లవకారుల ఉద్యమము, దాని తర్వాత గాంధేయ పద్దతిలో కాకుండా విప్లవాత్మకమైన పద్దతిలో 1942లో దేశమంతటిలో జరిగిన తిరుగుబాటు, సైనిక దళములలో విప్లవమనస్తత్వమును పెంపొందించుటకు కారణభూతమైన సుభాష్ చంద్రబోసుచే రూపొందింప బడిన తిరుగుబాటు, ఈ నిజమైన శక్తివంతమైన శక్తులే భారత దతేశములో బ్రిటిష్ రాజ్యపు పునాదులను కదిలించివేసినది. స్వాతంత్య్రమునకై జరిగిన ఈ తీవ్రమైన ప్రయత్నములనన్నిటినీ గాంధీజీ వ్యతిరేకించినాడు.
- అదే విధముగ, శాసన సభాంగణములలో దేశభక్తి పూరితులై పూర్తిగా రాజ్యాంగ బద్దమైన పద్దతులలో బ్రిటష్ వారితో స్పర్ధను సాగించి భారత రాజకీయములలో చెప్పుకోదగిన పురోగతిని సాధించుటకు కారణ భూతులైన వారికి తగిన కీర్తి చెందవలసి యున్నది. మనము సాధించుకొనిన దానినుండి సాధ్యమైనంత సానుకూలతను పొంది మరల పోరాటం కొనసాగించడం అనేది ఈ వర్గ దృక్పథము. స్వర్గీయ లోకమాన్య తిలక్, నృసింహ చింతామణికేల్కరు, చిత్తరంజన్‌దాస్, విఠల్‌బాయి పటేల్, గౌరవనీయులైన సర్దార్ వల్లబాయ్ భాయి పటేల్ సో దరుడు`పండిత మాళవీయ, భాయిలు గత పది సంవత్సరములలో ప్రముఖులైన హిందూ మహాసభ నాయకులచే ఈ వర్గము ప్రాతినిధ్యము వహింపబడిరది. అయితే మేధావులు, త్యాగ పరాయణులు, అయిన ఈ ఆలోచనా విధానమునకు చెందినవారిని గాంధీజీయే స్వయముగ చలకన చేసి అపహాస్యము చేయగా, తరచుగా అవే పద్దతులను అనుసరించిన ఆయన అనుయాయులు వారిని ఉద్యోగాన్వేషకులుగా వర్ణించినారు.
- బ్రిటిష్ వారు అధికారమును వదలునట్లు చేయుటకు, వారిని తక్కువగా అంచానా వేయుటకు వీలులేని ఇంకొక కారణము కూడా వున్నది. అదేమిటంటే కార్మిక పక్షము అధికారములోనికి రావడము, చర్చిల్ పతనము కావడం, దానికి మించి యుద్ధమువలన బ్రిటన్‌కు దాపురించిన భయానక ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సంబంధముగ దివాలాస్థితి.
గాంధేయ విధానము ఉచ్చస్థితిలో వున్నంతవరకు నిస్పృమ ఒకట్రే తప్పని ఫలితమైనది. ఆయన ఎప్పుడు గాని, ఉద్రేక పూరిత మనసు విప్లవ ధోరణి, తీవ్రవాద సరళి, ఉద్వేగముగల వ్యక్తిని గాని, వర్గమునుగాని, వ్యతిరేకించుచునే యుండినాడు. తన రాట్నము అహింస, సత్యములను మాత్రము ప్రోత్సాహించపరచినాడు. సత్యము విషయమునకు వస్తేనే అతి స్వల్పముగ చెప్పదలచినదేమిటంటే, సామాన్యమై ఒక కాంగ్రెసువాదియొక్క సత్యపరాయణత, రోడ్డులో తిరిగే సామాన్య మానవుని దానికన్న ఉన్నత స్థితిలో లేదనిన్నీ నిజయునకు అది సత్పాయచరణ నటనమనే రంగుతెర వేయబడిని అసత్యమేనని.
(మిగితా రేపు)
