(నిన్నటి తరువాయి)
- పైన చెప్పి విధముగ తలనొప్పితో అస్వస్థుడై యుండినందున నేను ప్రార్థనా స్థలమునకు కూడా పోయి యుండలేదు. సాయంత్రము ఆరు గంటలకు ఆప్టే మెరీనా హోటలుకు తిరిగివచ్చి, తాన ప్రార్థనా సమావేశమును పరిశీలించితిననియు, ఒకటి రెండు రోజులలో ప్రదర్వనను జరిపించగలననియు తెలిపినాడు.
తర్వా ఇంచుమించు ఒకటి రెండు రోజులలో ప్రదర్శనను జరిపించగలననియు తెలిపినాడు. తర్వాత ఇంచుమించు ఒక గంటలోగా గాంధీజీ ప్రార్థనా సమావేశము వద్ద ఒక ప్రేలుడు వలన కల్గిన అలజడిని విన్నాను. ఇంకా ఒక శరాణార్థి నిర్భంధింపబడినాడని గూడ విన్నాము. డిల్లీని వెంటనే వదిలివెళ్లడం సరిjైునదిగా ఆప్టె భావించినాడు. ఆ ప్రకారము మేము డిల్లీ నుండి వెళ్లిపోయినాము. - 1948 జనవరి 20వ తేదీన నేను హిందూసభ భవనము వద్ద బాడ్గెని కలుసుకొని నాననుట నిజము కాదు. 1948 జనవరి 20 తేదీన నేను బిర్లా భవనము వద్ద వుండులను చూచినామని చాలామంది సాక్షులు పలికినారు. వారు ఆ విధముగా పలుకుటలో పూర్తిగా పొరపాటు పడినారని నేను ఖచ్చితముగా చెప్పుచున్నాను. ఆ దినము నేను బిర్లా భవనమునకు పోయి యుండలేదు కాబట్టి సాక్షులలో కొంతమంది నన్ను గుర్తించడం ఎంత మాత్రం నమ్మదగినది కాదు. నన్ను తుగ్లక్ రోడ్డు పోలబీపీసు స్టేషనులో యుంచి యున్నప్పుడు పోలీసులు వారిలో చాలా మందికి నన్ను చూపి యున్నందున వారు నన్ను గుర్తింపగల్గినారు. అంతే కాకుండా 1948 ఫిబ్రవరి 12వ తేది వరకు నా తలపై వుండిన కట్టువలన నన్ను గుర్తించుట సులువుగా వుండినది. దీనికి వ్యితిరేకముగా సాక్షమిచ్చి పోలీసు సాక్షులు తప్పుడు సాక్ష్యము ఇచ్చిను. డిల్లీ సాక్షులకు బొంబాయిలో ఏర్పాటు చేసిన మొదటి గుర్తింపు విన్యాసమునాడే ఈ విషయమై నేను ఫిర్యాదు చేసి యున్నాను.
(తరావాయి రేపు)
