
తెలంగాణ సామ్నా డెస్క్: ‘‘పులి జింకను చంపితే ప్రత్యేకత ఏముంది? అది వార్త ఎలా అవుతుంది? అదే జింక పులిని చంపితే వార్త అవుతుంది’’. సరిగ్గా ఇలాంటి సంఘటనే మిర్యాలగూడలో జరిగింది. శాంతి భద్రతలు కాపాడే క్రమంలో స్నేహితులుగా, కఠినంగా కనిపించే ఓ పోలీస్ అధికారిని ముగ్గురు విలేఖరులు ‘‘బ్లాక్ మెయిల్’’ చేసి రూ.1.10 వేలు వసూలు చేశారు. ఎదో ఒక డిజిటల్ పత్రికకు విలేఖరులుగా పనిచేస్తున్న ముగ్గురు ఓ సిఐ స్థాయి అధికారి వద్ధ రూ. ఐదు లక్షలు డిమాండ్ చేసి రూ.1.10 వసూలు చేశారు అనే సంఘటన చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే, మిర్యాలగూడ డిఎస్‌పి రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం వట్టిపల్లికి చెందిన తప్పరి రఘు ఓ డిజిటల్ పత్రికకు జిల్లా రిపోర్టర్‌గా, అదే విధంగా పురబోయిన అంజనేయులు రెండు మండలాలకు రిపోర్టర్‌గా చలామణి అవుతున్నారు. అదే విధంగా అదే డిజిటల్ పత్రికకు బ్యూరో ఎడిటర్ ఆనంద్‌కుమార్ సహకారంతో వీరు జిల్లాలోని పలు ప్రాంతాలు తిరుగుతూ అధికారులను టార్గెట్ చేస్తు ఎలాంటి ఆధారాలు లేని కథనాలు రాస్తు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ క్రమలోనే మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబును టార్గెట్ చేసుకొని ‘‘వీరగాథ’’ పుపరుతో వరుస కథనాలను ప్రచురించి, రూ. ఐదు లక్షల కోసం డిమాండ్ చేశారు. చివరకు రూ. 1.1.0 లక్షలు వసూలు చేశారు. డిజిటల్ పత్రికలో వచ్చిన కథనాలు అబద్ధాలు, కట్టు కథలు అని, నిరాధరమని విచారణలో తేలాయా. ఈ క్రమంలో సిఐ వీరబాబు సదరు విలేఖరులపై మిర్యాలగూడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, సిఐ వీరబాబు వద్ధ నుండి డబ్బులు వసూలు చేస్తుండగా సిసి కెమారాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిఐ వద్ధే కాకుండా ఈ ముఠా ఓ మెడికల్ ఆఫీసర్ వద్ధ రూ. 50 వేలు, ఓ ఫారెస్ట్ అధికారి వద్ధ రూ. 50 వేలు వసూలు చేశారు. వీరి వద్ధే కాకుండా ఇంకా చాలా మంది వద్ధ వసూల్ చేసినట్లు తెలుస్తుందని, వాటిపై కూడా విచారణ చేపట్టామని డిఎస్‌పి తెలిపారు. ముఠాలోని ముగ్గురిలో రఘు, అంజనేయులును ఆదివారం అరెస్ట్ చేయగా ఆనంద్ కుమార్ పరారీలో వున్నట్లు మిర్యాల గూడా డిఎస్‌పి రాజశేఖర్‌రాజు తెలిపారు.
(గతంలో జగిత్యాల జిల్లాలో సిఐగా తన సేవలను అందించిన రాజశేఖర్‌రాజు ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిఎస్‌పి గా విధుల నిర్వహిస్తున్నారు.)
