
‘‘లవ్ జిహద్’’ చావులన్ని తల్లిదండ్రులు చేస్తున్న హత్యలే!
తెలంగాణ సామ్నా బ్యూరో: ‘‘లవ్ జిహాద్’’ కారణంగా మరణించిన వారి ఆత్మహత్యలన్ని తల్లిదండ్రులు చేసే హత్యలేనన్న తీవ్ర విమర్శ వస్తున్నది. తమ పిల్లల పెంపకం పట్ల సరిఅయిన దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటి విపరీతాలు దాపురిస్తున్నయన్న వాదన వస్తున్నది. అమ్మాయిల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, మా పాప బంగారం లాంటి సెంటిమెంట్ ఆలోచనలు తల్లిదండ్రులు పెట్టుకొని పిల్లలను పట్టించుకోకుండా వదిలివేయడం వల్లే బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎర్పడుతుందన్న వాదన వస్తున్నది. అమ్మాయికి చదువు, సంస్కారం, వినయం, విధేయతలే నేర్పకుండా పెంచితే కలిగే దుష్పలితాలు ఆయా తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించడమే కాదు. పదిమందిలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి తీసుకు వస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు.
‘‘పంది కూడా నంది లాగా’’ కనిపించే వయసులో దొరికే స్వేచ్చను కొందరు అమ్మాయిలు ఆర్థం చేసుకోక ప్రేమ అంటూ పెళ్లి అంటూ తమ తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే విధంగా చేయడం శోచనీయం అనే భావన ఎర్పడుతుంది. దీనికి తోడు చట్టాలు మైనర్ మేజర్ అంటూ రక్షణ కల్పించడంతో ఇంకా సదరు అమ్మాయిల స్వేచ్చకు అంతేలేకుండా పోతుంది. చట్ట ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం యువతీ యువకులు సమానం అయినప్పుడు యువకులకు మేజర్ అయ్యే వయసు ఒక రకంగా, యువతులకు మేజర్ అయే వయసు ఒక విధంగా ఎందుకు వుండాలి? అనే వాదనను పక్కన బెడితే చట్టం తమకు కల్పించిన వెసులుబాటును యువతులు కొందరు యిష్టానుసారంగా వాడుకుంటున్నారన్న వాదనలు వున్నాయి.
తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య చాలా మంది యువతుల్ని ఆలోచింపజేసే విధంగా వుందని చెప్పవచ్చు.
ఓ యువతి. ఏలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం. తల్లిదండ్రులు మంచి ఉద్యోగంలో వున్నారు. కూతురు జీవితంపై, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అల్లారుముద్ధుగా పెంచుకున్నారు. కూతురు భవిష్యత్తుపై ఈస్ట్‌మన్ కలర్‌లో కలలు కని వుంటారు. అంతా బాగానే వుంది. కాని ఆ తల్లిదండ్రులు తమ కూతురు లోకం పోకడలు ఎలా వున్నాయో? చెప్పారో లేదో తెలియదు. ఇంటినుండి బయటకు వెళ్లితే ఎన్ని ఊరకుక్కలు కాచుకొని వుంటాయో అనే అతి చిన్న జీవితసత్యం ఆ తల్లిదండ్రులు చెప్పారో లేదో తెలియదు. నవ్వించి, నమ్మించి వెంటపడే రెండుకాళ్ల తోడేళ్లు చుట్టు తిరుగుతూనే వుంటాయి అనే జీవిత సత్యాన్ని ఆ తల్లిదండ్రులు తెలిపారో లేదో తెలియదు. తమ కూతురును రోజుకు కనీసం ఒక పది నిమిషాలు తమతో పాటుగా కూర్చుండి ఒక స్నేహితులుగా జీవిత సత్యాలు నేర్పారో లేదో తెలియదు. లేదా తమ కూతురుకు అన్ని తెలుసు అనుకున్నారో లేదా కూతురుతో లోకంతీరు గురించి మాట్లాడితే తమ పెద్ధరికం ఎక్కడ పడిపోతుందో అని అనుకున్నారో తెలియదు కాని ఆ ఆమ్మాయి ప్రేమలో పడిoది.
ముందే అనుకున్నట్లుగా పంది కూడా నందిలాగా కనబడే వయసు పొరపాటు వల్లే కావచ్చు లేదా ఇంట్లో దొరికిన స్వేచ్చ వల్లే కావచ్చు ఆ ఆమ్మాయి కూడా ముందు వెనక చూడకుండా, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పాచిపోయిన అన్నాన్ని చెత్తకుండీలోకి విసిరేసినంత సులభంగా బంధాల్ని తెంపుకొని ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు తల్లిదండ్రులు పిలిపించి అడిగితే ‘‘నేను మేజర్ని’’ నా జీవితం నా యిష్టం అని ఘంటాపథంగా తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయే మాటలు చెప్పేసింది. ఇంకేం వుంది? చట్ట ప్రకారం ఆ యువతిని ఏమీ అనలేని పరిస్థితిలో పోలీసులే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.
ఇంతటితో ఆ యువతి ‘‘ప్రేమాయణం’’ అనే సినిమాకు ఇంటర్వేల్ పడిoది. సీన్ కట్ చేసి మళ్లీ ‘‘సినిమా’’ చూసే సరికి ఆ యువతి ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. ప్రేమ వివాహం కదా! ఆమెకు ఏం? అనుకొనే లోగానే పోలీసులు ఇంటికి రావడం ఆమె భర్తను పట్లుకెళ్లడం జరిగాయి. ఎంటని ఆరా తీస్తే తన భర్త ఒక దొంగని చైన్ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్‌న్లతో పాటు పలు రకాల దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిసి ఆ యువతి కన్నీళ్ల పర్యంతం అయ్యింది. వాస్తవానికి అపుడు ఏడిస్తే వచ్చేది కన్నీళ్లే కాని పోయిన గతం కాదు కదా! (ఆ యువతి కన్నీళ్లు తుడవడానికి ఏ ఒక్కరు లేరు రారు అనే విషయం దాదాపుగా అందరికి ఆర్థం అయ్యే వుంటుంది) ఆ యువతి తనకు తానుగానే ఏడ్చింది. తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును తలుచుకుంది. పున్నమి వెన్నలలాగా ఎపుడు నిండుగా వుండాల్సిన ఆ యువతి దిక్కుతోచని స్థితిలో కనీసం అమ్మా! అని ఎవరినన్న పిలుద్ధామన్న పిలవలేని నిస్సహయస్థితిలో కుమిలి కుమిలి ఏడ్చింది.
ఆ ఏడుపులోనే ఓ నిర్ణయం తీసుకుంది. అదే తాను చావడం. తాను చనిపోతే ఏలా? తన పిల్లలను ఎవరు చూస్తారు? అనే ఆలోచన వచ్చిందో ఏమో? పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. చాలా కఠిన నిర్ణయం అది. కాని తప్పదు. కాలు కింద పెడతా డాడీ. కాళ్లు కందిపోతాయి. ఓ గంపెడు గులాబిపూలు తీసుకొచ్చి నేల మీద పోయండి అని ఆర్డర్ వేస్తే కూతురు కోసం లారేడు గులాబిపూలు తీసుకొచ్చి కుమ్మరించే శక్తి వున్న తల్లిదండ్రులు వున్నా కేవలం ప్రేమ పేరుతో నా అన్న వాళ్లందరిని వదిలి ఒంటరిదై బ్రతుకు చీకటి చేసుకొని… తను చేసిన వయసు పొరపాట్లకు కళ్లముందు కనిపిస్తున్న రెండు చిగురాకులను కూడా తనతో తీసుకెళ్లి కనీసం వేరే లోకంలో అయినా ప్రశాంతంగా వుండాలనుకుందేమో ఏమో? తన పిల్లలకు ఉరి వేసి తాను కూడా ఉరి వేసుకుంది.
ఓ సినిమా కథను మరిపించే జీవిత కథ మౌనిక అలియాస్ ప్రేజాది.
రైళ్లలో పరిచయం, కోచింగ్ సెంటర్లలో దోస్తానా లాంటి చిన్న చిన్న సందర్భాలను క్యాచ్ చేసుకున్న ఓ తోడేలు ఎంతో నమ్మకంగా పెంచుకున్న ఓ అందమైన కుందెలు పిల్లను ఒడిసిపట్టుకొని పోయింది. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఒకటే విషయం వుంది. ఇలాంటి ‘‘లవ్ జిహద్’’ లన్ని కూడా ఓ రకంగా తల్లిదండ్రులు చేస్తున్న సెంటిమెంటల్ మర్డర్‌లే. తమ పిల్లలకు సభ్యత, సంస్కారం, ధర్మం, ఆచరణ, సమాజం పట్ల అవగాహన కల్పించకపోవడం, లోకం పోకడ తెలియకుండా పెంచడం, ఫ్యాషన్ పేరిట అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకున్న పట్టించుకోకపోవడం, పైగా సమర్ధించడం లాంటి ఎన్నో రుగ్మతలతో నేటి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘‘అందుకే ఇలాంటి ప్రేమ వివాహలకు మొదటి ముద్ధాయిలు తల్లిదండ్రులే అనే తీవ్ర విమర్శ వస్తున్నది. అంతా అయ్యాకా నింగి పగిలేలా ఏడ్చేకన్నా తమ సంతానానికి జీవితం, ధర్మం గురించి అవగాహన కల్పిస్తే సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. తల్లిదండ్రులకు కడుపుకోత తగ్గుతుందన్న వాదనలు వస్తున్నాయి.
