(నిన్నటి తరువాయి)
ఇక ముందు పేజీలలో వున్న ప్రకటన మహాత్మాగాంధీ హత్య కేసు రికార్డులోని భాగమై ప్పుడు సిమ్లాలో వుండిన పంజాబ్ హైకోర్టులో 1949 సంవత్సరపు 66 నుండి 72 వరకు సంఖ్యలు గల క్రిమినల్ అపీళ్ళు ముద్రిపంబడిన రెండవ వాల్యూములో వున్నది.
ఒకటి:
గౌరవనీయులైన తమ సంప్రీతి కొరకు:
అది ఎర్రకోటలోని ప్రత్యేక న్యాయాధిపతి న్యాయస్థానము మహాత్మాగాంధీ హత్యకేసులో అనగా నాథూరాం గోడ్సే మొదలగు వారిపై నేరారోపణ జరిగిన కేసులో ఏరారోపకులు తమ సాక్ష్యమును పూర్తి చేసినారు.
ప్రత్యేక న్యాయాధిపతి తన అసనమును అధిష్టించినారు. న్యాయస్థానము వున్న గదిని నిశ్శబ్దము అవహించినది. నిందుతులు బోనులో వారికి నిర్ణయింపబడిన స్థలములలో అసీనులుగ చేయబడినారు. ఇరు పక్షముల న్యాయవాదులు సమక్షములో నున్నారు. పత్రికా విలేఖరులు ఉత్కంఠతతో చేతులలో సేనాలు బూని సిద్ధముగా నున్నారు.
న్యాయస్థానపు గది పూర్తి నిండిపోయినది. ప్రత్యేక అనుమతి పొందిన వారిని మాత్రమే ప్రవేశింప నిచ్చినారు.
నిందితుల వాదమును వినబోవుచున్నారు. ఆ దినము 1948 నవంబరు 8వ తేది.
నేరనిర్ణయ విధాన స్మృతిలను 342 పరిచ్చేదము ప్రకారము న్యాయాధిపతి నిందితులను పరీక్షించుటకు ప్రారంభించినారు. ఆయన బిగ్గరగా అనినాడు.
‘‘మొదట నిందితుడు, నాథూరామÊ వినాయక గోడ్సే, హిందువు, వయస్సు 37 సంవత్సరములు, హిందు రాష్ట్ర పత్రికా సంపాదుకుడు, పూణే’’.
‘‘మొదటి నిందినతుడు’’ అనుమాట వినగానే నాథూరాం లేచి నిలబడినాడు.
న్యాయాధఙపతి కొనసాగించినాడు. ‘‘నీకు వ్యతిరేకముగ నేరారోపకులు వైపు నుండి ప్రవేశ పపెట్టబడిన సాక్ష్యమునుంతటిని నీవు వినినావు. దాని విషయమై నీవు ఏమి చెప్పదలచినావు?’’
నాథూరాం జవాబు చెప్పినాడు…. ‘‘గౌరవనీయ న్యాయాధిపతి! నేను వ్రాతపూర్వకమైన వాంగ్మూలమును సమర్పింప దలచినాను.’’
‘‘కానివ్వండి. నీ ప్రకటనను చదువుము’’ అన్నారు న్యాయాధిపతి. ఈ దశలో అడ్వకేటు జనరల్, శ్రీదఫ్తారి, తన అక్షేపణ తెలుపుటకు నిలబడినారు. అన అన్నారు.
‘‘గౌరవనీయ న్యాయాధిపతి! ముద్దాయి ఈ కేసుకు అనుగుణమైన విషయములను మాత్రమే నివేదించుటకు అనుమతించవలసి యున్నది. అట్ట కానిచో అతను ప్రకటనను చదువుటకు అనుమతిని నిరాకరించవలెను’’.
న్యాయాధిపతి అక్షేపణము తిరస్కరించినారు.
నాథూరామ్ తన వ్రాతములకమైన ప్రకటనను చదువటకు ‘‘మైకు’’ ముందు స్థిరముగ నిలబడినారు. న్యాయస్థానగదిని ఆవహించిన నిశ్శబ్ధము, తమ ప్రతిధ్వని తరంగములచే మరింత స్పష్టమగునట్లు కంచు కంఠము నుండి సాగినవి అతని వాక్కులు:
‘‘గౌరవనీయులైన తమ సంప్రీతి కొరకు’’……
(తరువాయి బాగం రేపు)
