23.6 C
Hyderabad
Friday, July 31, 2026
No menu items!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత

తెలంగాణ సామ్న: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్‌ సింగ్‌ డిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్న తరుణంలోనే మనోహ్మన్‌ మరణించినట్లు వైద్యులు తెలిసారు. దీనితో కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విషాద చాయలు అలుముకున్నాయి.
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా మన్మోహన్‌కు పేరుంది. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ తన పదవికాలమైన 2004 నుండి 2014 వరకు దేశంలో ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్న పేరు సంపాదించుకున్నారు.
1932వ సంవత్సరం సెప్టెంబర్‌ 26న ప్రస్తుతం పాకిస్థాన్‌లో వున్న చక్వాల్‌లో మన్మోహన్‌ జన్మించారు. ప్రధానమంత్రులు
నెహ్రు, ఇందిరాగాంథీ, మోడీ తరువాత ఎక్కువకాలం ప్రధానమంత్రిగా ఆయన కొనసాగారు. ప్రధానమంత్రిగా కాకుండా ఆర్థిక మంత్రిగా, ఆర్థిక శాఖలో సలహాదారునిగా, కార్యదర్శిగా రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌గా కూడా ఆయన తన సేవలను అందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles