23.3 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

కాంగ్రెస్‌ “చేతికి కాల్చి వాతలు” పెడుతున్న కేజ్రీవాల్‌

LG PERMITED ED TO PRASITUTE ARAVIND KEJRIWAL

తెలంగాణ సామ్న: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌
“కాంగ్రెస్‌ చేతికి రాజకీయ వాతల మీద వాతలు” పెడుతున్నాడన్న చర్చ జరుగుతున్నది. డిల్లీ, బీహర్‌ ఎన్నికలు
త్వరలో వున్న నేపథ్యంలో కలిసికట్టుగా సాగాల్సిన ఇండియా కూటమి రైలు పైలట్‌ చేతికి కేజ్రీవాల్‌ వాతలు
పెడుతున్నాడని కాంగ్రెస్‌పై ప్రజలు సైటర్లు వేస్తున్నారు అంటే వారి మధ్య సయోధ్య ఎంతగా చెడిపోయిందో ఆర్థం
చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఇండియా కూటమి నుండి కాంగ్రెస్‌ను తొలగించాలని తాము మిత్రపక్షాలను కోరతానని కేజ్రీవాల్‌
చెప్పడం రాజకీయ చర్చానీయాంశం అయ్యింది. తల్లివేరు లాంటి పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌నే పక్కన బెడితే
ఇంకా ఇండియా కూటమి మనుగడ ఏముంది? అనే ప్రశ్న వస్తున్నది. అయితే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌
బీజేపితో చేతులు కలిపిందని ఆప్‌ మరో నేత సంజయ్‌సింగ్‌ ఆరోపిస్తున్నారు. డిల్లీలో బాజాపా గెలుపుకోసం
కాంగ్రెస్‌ పనిచేస్తుందని ఆయన విమర్శించారు. అలాగే కేజ్రీవాల్‌ను యాంటీ నేషనల్‌ అని విమర్శించిన
కాంగ్రెస్‌ నేతపై చర్యలు తీసుకోకపోతే కూటమి నుండి ఆ పార్టీని తొలగించాలని తాము ఖచ్చితంగా కోరతామని
సంజయ్‌సింగ్‌ తెలిపారు. దీనితో డిల్లీలో ఆ రెండు పార్టీల గొడవ త్వరలో జరిగే ఎన్నికలపై పడి నెగెటివ్‌ సంకేతాలు వచ్చే
అవకాశాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles