తెలంగాణ సామ్న: కామారెడ్డి జిల్లాతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బిక్కనూరు ఎస్సై, సాయికుమార్ బీబీపేట కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్‌ల మృతదేహలు ఒకే చెరువులో లభ్యం కావడంతో ఇంతవరకు వారి మృతిపై పెరిగిన అంచనాలకు, అనుమాలకు ఒక రూపం వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. మొదట్లో ఇద్దరి మృతదేహలే దొరకడంతో పలు అనుమానాలు వచ్చాయి. కాని ముగ్గురి మృతదేహలు ఒకే చెరువులో దొరకడంతో అసలు ముగ్గురు ఎందుకు చెరువులోకి వెళ్లారు? లేదా బలవర్మణాలకు పాల్పడ్డారు? అనే ప్రశ్న అందరిలో తలెత్తుత్తున్నది.
చర్చలు విఫలం కావడం వల్లనే ఇదంతానా..?
ముగ్గురి మృతికి సంబంధించి పలు కథనాలు, ఊహగానాలు వెలువడుతున్న నేపథ్యంలో వీరి మృతికి బలం చేకూరేలా ఒక వాదన వినిపిస్తున్నది. గత పరిచయం ఆధారంగా సాయికుమార్ శృతితో వున్న స్నేహం ఇకపై వుండదు. ఇక తన స్నేహితుడు నిఖిల్ వుంటాడు అనే విషయంపైనే ముగ్గురు చర్చించి నిర్ణయం తీసుకొని విడిపోవాలి అనే ఉద్ధేశ్యంతోనే వారు అక్కడ కలిసినట్టుగా ఊహగానాలు వస్తున్నాయి. అయితే సాయికుమార్ అందుకు ఒప్పుకోకపోవడంతో శృతి నీటిలోకి దూకిందనే వాదన వస్తున్నది. ఆమెను రక్షించే క్రమంలోనే సాయికుమార్, నిఖిల్ నీటిలోకి దూకినారని ఆ క్రమంలోనే ముగ్గురు చనిపోయారనే బలమైన వాదన వినవస్తున్నది.
అయితే ఈ మిస్టరీని చేధించాలని కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పోలీసుల నైతికతకు సంబంధించిన ఆంశం సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం వుండడంతో ఎస్పీ అన్ని విధాలుగా కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సంచలనం సృష్టించిన ముగ్గురి మరణం కేసు త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంది.
